Telangana Corona: తెలంగాణలో కాస్త పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 767 మందికి పాజిటివ్, ముగ్గురు మృతి
తెలంగాణలో గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో కొత్త కేసులు 700కు పైగా నమోదయ్యాయి.

Telangana Reports New Coronavirus cases: తెలంగాణలో గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలో కొత్త కేసులు 700కు పైగా నమోదయ్యాయి. మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో 1,18,778 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 767 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యశాఖ మంగళవారం సాయంత్రం వెల్లడించింది. కాగా, కరోనాను జయించలేక ముగ్గురు ప్రాణాలను విడిచారు.
తాజాగా నమోదైన 767 కరోనా కేసులతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,33,146కు చేరింది. కరోనాతో కొత్తగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 3738కి చేరింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.
గడిచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 848 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మహహ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 6,19,344కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,064 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో రికవరీ రేటు 97.82 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు చేసిన నాటి నుంచి కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా కేసులు తక్కువగానే నమోదవుతుండటం గమనార్హం.

Telangana Covid 19 Cases
జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి….
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలవారీగా కొత్త కేసులను గమనించినట్లయితే.. ఆదిలాబాద్ జిల్లాలో 4, భద్రాద్రి కొత్తగూడెంలో 34, జీహెచ్ఎంసీలో 77. జగిత్యాలలో 17, జనగామలో 7, జయశంకర్ భూపాలపల్లిలో 14, జోగులాంబ గద్వాలలో 1, కామారెడ్డిలో 4, కరీంనగర్ లో 51, ఖమ్మంలో 84, కొమురంభీం ఆసిఫాబాద్ లో 3, మహబూబ్‌నగర్‌లో 20, మహబూబాబాద్‌లో 20, మంచిర్యాలలో 65, మెదక్‌లో 3, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 26, ములుగులో 18, నాగర్ కర్నూలులో 6, నల్గొండలో 52, నారాయణపేటలో 2, నిర్మల్‌లో 3, నిజామాబాద్‌లో 5, పెద్దపల్లిలో 59, రాజన్న సిరిసిల్లలో 17, రంగారెడ్డిలో 9, సంగారెడ్డిలో 9, సిద్దిపేటలో 19, సూర్యాపేటలో 29, వికారాబాద్ లో 3, వనపర్తిలో 4, వరంగల్ రూరల్ లో 17, వరంగల్ అర్బన్‌లో 49, యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Read Also….
