షూటింగ్స్ షురూ అవుతాయా? టీఎస్ సర్కార్‌కి డెమో ఇవ్వనున్న చిత్ర పరిశ్రమ

ఈ భేటీలో చివరి దశలో ఆగిపోయిన సినిమా షూటింగ్‌ల గురించి చర్చించారు. అలాగే సినిమా షూటింగ్‌లు ప్రారంభించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా తక్కువ మందితో చేస్తారు అనేదానిపై ఒక డెమో వీడియో..

షూటింగ్స్ షురూ అవుతాయా? టీఎస్ సర్కార్‌కి డెమో ఇవ్వనున్న చిత్ర పరిశ్రమ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 21, 2020 | 1:40 PM

సినీ ఇండస్ట్రీపై ఆధారపడి ఎన్నో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. లాక్‌డౌన్ కరోనా కారణంగా థియేటర్స్ అన్నీ మూతపడ్డాయి. మరో రెండు, మూడు నెలల వరకూ తెరుచుకునేందుకు కూడా అవకాశాలు కనిపించడం లేదు. ఈలోగా చిత్ర పరిశ్రమ కోలుకునేలా షూటింగ్స్ ఎలా ప్రారంభించాలి? థియేటర్స్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశాలపై ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు సినిమా పరిశ్రమ ప్రముఖులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

ఈ భేటీలో చివరి దశలో ఆగిపోయిన సినిమా షూటింగ్‌ల గురించి చర్చించారు. అలాగే సినిమా షూటింగ్‌లు ప్రారంభించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా తక్కువ మందితో ఎలా చేస్తారు? అనేదానిపై ఒక డెమో వీడియోని.. ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ చిత్ర పరిశ్రమకు అనుకూలంగా ఉందన్నారు. ఇప్పుడు కూడా షూటింగ్‌లు ఎలా ప్రారంభించాలి అనే విషయాన్ని పరిశ్రమ ఒక ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరారు. తద్వారా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వీలుందన్నారు.

ఈ సమావేశంలో చిరంజీవి, నాగార్జునలతో పాటు నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్, సి కళ్యాణ్, శ్యాం ప్రసాద్ రెడ్డితో పాటు దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్ శంకర్, కొరటాల శివతో పాటు పలువురు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ ఈ భేటీలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: 

వృద్ధులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..

‘కరోనా కాలర్ ట్యూన్‌’తో విసుగుచెందారా.. ఈ సింపుల్ ట్రిక్‌తో దాన్ని కట్ చేయండి

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో