AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో మీ కోసం …

తెలంగాణ‌లో విస్త‌రిస్తోన్న వైర‌స్ దాడిని ఎదుర్కొనేందుకు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు దిగింది ప్ర‌భుత్వం. అందులో భాగంగా ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్‌. దీంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇళ్లు దాటి బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సిన నేపథ్యంలో...

లాక్‌డౌన్‌లోనూ అందుబాటులో మీ కోసం ...
Jyothi Gadda
|

Updated on: Mar 23, 2020 | 12:13 PM

Share

ఎక్క‌డో చైనాలోని వుహాన్‌లో పుట్టిన వైర‌స్‌…ఎల్ల‌లు దాటుకుని తెలుగు రాష్ట్రాల్లోనూ పంజావిసురుతోంది. వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాయి. తెలంగాణ‌లో విస్త‌రిస్తోన్న వైర‌స్ దాడిని ఎదుర్కొనేందుకు చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు దిగింది ప్ర‌భుత్వం. అందులో భాగంగా ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్‌. దీంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ ఇళ్లు దాటి బయటకు వచ్చే అవకాశం లేదు. ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సిన నేపథ్యంలో కొన్ని వర్గాలకు మాత్రం ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. ముఖ్యంగా ఆహారం కోసం రెస్టారెంట్లు, హోటళ్లపై ఆధారపడే వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టేక్‌ అవే, హోం డెలివరీకి హోటళ్లకు అనుమతినిచ్చింది. అవేంటో చూద్దాంః

లాక్‌డౌన్‌లోనూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండే సేవ‌లు

బ్యాంకులు, ఏటీఏంలకు సంబంధించిన కార్యకలాపాలు

– ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా, భద్రతా సిబ్బంది(‍ప్రైవేటు సంస్థలు సహా),

– వైద్య సిబ్బంది, ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్‌ సెంటర్లు, ఆప్టికల్‌ స్టోర్లు, ఫార్మసుటికల్స్‌ తయారీ- రవాణా

– ఫుడ్‌, ఫార్మాసుటికల్‌, వైద్య పరికరాలకు సంబంధించిన ఈ- కామర్స్‌ సేవలు

– అత్యవసర వస్తువుల సరఫరా, ఆహార ఉత్పత్తులు, కూరగాయలు, పాలు, పండ్లు, బ్రెడ్‌, కిరాణా సామాన్లు, కోడిగుడ్లు, మాంసం, చేపలు తదితరాల రవాణా

– రెస్టారెంట్ల టేక్‌ అవే, హోం డెలివరీ సేవలు

– పెట్రోలు పంపులు, ఎల్పీజీ గ్యాస్‌, ఆయిల్‌ ఏజెన్సీలు అందుకు సంబంధించిన గోడౌన్లు, రవాణా

– కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు అత్యవసర సేవలు అందించే అన్ని ప్రైవేటు సంస్థలు

– ఎయిర్‌పోర్టులు, సంబంధిత కార్యకలాపాలు

– ​​​​​​​జిల్లా కలెక్టరేట్‌, డివిజన్‌, మండల కార్యాలయాలు

–  స్థానిక సంస్థలు, పంచాయతీలు

– వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స సంవర్ధక, వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థ

– కాలుష్య నివారణ మండ‌లి, లీగల్‌ మెట్రాలజీ, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌

– కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమయ్యే అన్ని ప్రభుత్వ సంస్థలు

– పోలీసు వ్యవస్థ, అగ్నిమాపక సిబ్బంది

– ఎక్సైజ్‌, కమర్షియల్‌ ట్యాక్సు, రవాణా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సిబ్బంది

– టెలికాం, పోస్టల్‌, ఇంటర్నెట్‌ సర్వీసులు

–  విద్యుత్‌, నీటి సరఫరా కార్యాలయాలు

– నిరంతరాయంగా పనిచేసే ప్రభుత్వ సంస్థలు

Read this also:

నేటి నుంచి బ్యాంకుల్లో ఆ సేవలన్నీ బంద్!