తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ స‌ర్కార్‌ సాయం

తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ స‌ర్కార్‌ సాయం

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందించింది. ఢిల్లీలో పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులకు కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.12 లక్షలు మంజూరు చేసింది. ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ చొరవతో ప్రభుత్వం స్పందించింది. తక్షణ సాయం కింద రూ.75 వేలు విడుదల చేసింది. ఢిల్లీలో పలువురు తెలుగు జర్నలిస్టులకు కరోనా సోకిన నేపథ్యంలో వారి గురించి మంత్రి కేటీఆర్‌ ఆరా తీశారు. జర్నలిస్టులకు […]

Jyothi Gadda

|

May 06, 2020 | 7:38 AM

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న తెలుగు జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందించింది. ఢిల్లీలో పనిచేస్తున్న తెలుగు జర్నలిస్టులకు కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.12 లక్షలు మంజూరు చేసింది. ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌ అర్వింద్‌ కుమార్‌ చొరవతో ప్రభుత్వం స్పందించింది. తక్షణ సాయం కింద రూ.75 వేలు విడుదల చేసింది.
ఢిల్లీలో పలువురు తెలుగు జర్నలిస్టులకు కరోనా సోకిన నేపథ్యంలో వారి గురించి మంత్రి కేటీఆర్‌ ఆరా తీశారు. జర్నలిస్టులకు అవసరమైన సాయం చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.  ఢిల్లీలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పర్యవేక్షిస్తున్నారు. జర్నలిస్టులు ఆందోళన చెందవద్దని, అవసరమైన సాయాన్ని అందిస్తామని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన తెలుగు జర్నలిస్టులకు వైద్యం అందించే విషయమై కేంద్ర, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో పాటు ఆస్పత్రి వర్గాలతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్వయంగా మాట్లాడారు. 31 మంది జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు అపోలో ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కరోనా పరీక్షలు చేయించారు. కాగా, ఢిల్లీలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న విషయం విదితమే. ఇప్పటి వరకు 4898 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఇప్పటి కరోనా బారిన పడి 64 మంది ప్రాణాలు కోల్పోయారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu