Big News Big Debate: ట్యాక్స్ పేయర్స్ లేక్కలు చూస్తే ఔరా అనాల్సిందే!

కేంద్రం చిన్న సందు ఇవ్వడంతో రాష్ట్రాలు రంగంలో దిగాయి. చాలారాష్ట్రాల్లో నిన్నటి నుంచి సేల్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. మొదటిరోజే అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, బెంగాల్..

Big News Big Debate: ట్యాక్స్ పేయర్స్ లేక్కలు చూస్తే ఔరా అనాల్సిందే!
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 11:32 PM

దేశ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్నాయి లిక్కర్‌ సేల్స్. ధరలు పెరిగినా ఫర్వాలేదు… లిక్కర్‌ ఉంటే చాలని మద్యం ప్రియులు ఫుల్‌ ఖుషీగా ఉంటే.. అటు పొలిటికల్‌ లీడర్స్‌ ఫైటింగ్‌కు రెడీ అయ్యారు. 40 రోజుల తర్వాత తెరుచుకున్న షాపుల వద్ద ఉదయం నుంచే బారులు తీరుతున్నారు జనాలు. కరోనా ఎఫెక్టుతో ఆర్ధికంగా పీకల్లోతు కష్టాల్లో ఉన్న రాష్ట్రాలు.. దీనిని కూడా అవకాశంగా మలుచుకుని ధరలు భారీగా పెంచుతున్నాయి.

మే4న లాక్‌డౌన్‌ మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం.. మద్యం షాపులకూ ఒకే ఉంది. కంటైన్‌మెంట్‌, హాట్‌స్పాట్స్‌ మినహా అన్ని జోన్లలో లిక్కర్‌ విక్రయాలకు అనుమతించింది. ఫిజికల్‌ డిస్టాన్స్‌ కండీషన్స్‌ అప్లై అంటోంది హోంశాఖ. కేంద్రం చిన్న సందు ఇవ్వడంతో రాష్ట్రాలు రంగంలో దిగాయి. చాలారాష్ట్రాల్లో నిన్నటి నుంచి సేల్స్‌ స్టార్ట్‌ అయ్యాయి. మొదటిరోజే అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర, బెంగాల్‌, ఏపీ, యూపీ, హిమాచల్‌ ప్రదేశ్‌, అసో వంటి రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. అయితే పంజాబ్‌, కేరళ రాష్ట్రాలు మాత్రం మద్యం అమ్మకాలకు నో చెప్పాయి.

మద్యంపై ఫస్ట్ డే లిక్కర్ సేల్స్:

– ఏపీలో మొత్తం మద్యం షాపులు 3650 ఉండగా.. ఓపెన్ చేసినవి 2345. ఇక ఫస్ట్‌డేనే ఆంధ్రప్రదేశ్‌లో రూ.68 కోట్ల లిక్కర్ సేల్ అయ్యింది. – ఇక యూపీలో ఒక్క రోజులో దాదాపు 300 కోట్ల రూపాయల మద్యం అమ్ముడు పోయింది. – కర్ణాటకలో 15 వందల లిక్కర్ షాపులు – 30 శాతం ధరలు పెంచింది వెస్ట్ బెంగాల్‌ ప్రభుత్వం. ఇక్క రూ. 4 వేల కోట్లు అదనపు ఆదాయం లక్ష్యంగా అక్కడ సేల్స్ నిర్వహణ – ఢిల్లీలో మొత్తంగా 150 షాపులు మాత్రమే తెరుచుకున్నాయి. అలాగే 70 శాతం ధరలు పెంచింది ప్రభుత్వం – ఇక గోవాలో 13 వందల షాపులు ఓపెన్ అయ్యాయి – అలాగే ఛత్తీస్‌గఢ్‌లో మద్యాన్ని హోమ్ డెలీవరీ సదుపాయం కల్పించారు

మిగిలిన వివరాలు ఈ కింది డిబేట్‌లో చూడండి: