వాహనదారులకు ‘కరోనా’ షాక్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు..
కరోనా కాలంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్నిమరోసారి పెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ. 13 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఈ పెంపు నేటి నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ భారం ఆయిల్ కంపెనీలపై పడటం వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉండదు. గత మార్చి నుంచి మోదీ సర్కార్ ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. […]

కరోనా కాలంలో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్నిమరోసారి పెంచుతూ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. లీటర్ పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ. 13 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. ఈ పెంపు నేటి నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ భారం ఆయిల్ కంపెనీలపై పడటం వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉండదు.
గత మార్చి నుంచి మోదీ సర్కార్ ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. తాజా పెంపు వల్ల కేంద్ర ఖజానాకు రూ. 1.6 లక్షల కోట్ల ఆదాయం లభించనుంది. కాగా, ఢిల్లీ సర్కార్ కరోనాపై పోరులో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కీలక ప్రకటన చేసిన అనంతరం కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా మద్యం, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే దిశగా అడుగులు వేస్తున్నాయి.
Central Government Raised Excise Duty On Petrol And DieselCentre Raises Excise Duty On Petrol And DieselLatest National NewsNational News UpdatesNo Change In Petrol And Diesel Rates