AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Covid19: తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం.. నిన్న వెయ్యి దాటిన కేసులు, ఇవాళ రెండు వేలకు చేరువగా నమోదు!

న్యూ ఇయర్ ప్రారంభం నుంచి తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. హైదరాబాద్ లో నమోదవుతున్న కరోనా కేసులను చూస్తే మునుపటి అల్లకల్లోలం తప్పదనిపిస్తుంది.

Telangana Covid19: తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం.. నిన్న వెయ్యి దాటిన కేసులు, ఇవాళ రెండు వేలకు చేరువగా నమోదు!
Balaraju Goud
|

Updated on: Jan 06, 2022 | 8:42 PM

Share

Telangana Coronavirus Cases Today update: న్యూ ఇయర్ ప్రారంభం నుంచి తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. హైదరాబాద్ లో నమోదవుతున్న కరోనా కేసులను చూస్తే మునుపటి అల్లకల్లోలం తప్పదనిపిస్తుంది. రోజురోజుకు వేలల్లో కేసులు నమోదవుతుండంతో థార్డ్ వేవ్ రాష్ట్రంలోకి ఎంటరైందని.. రానున్న రోజులన్నీ వెరీ వెరీ డేంజరీ అంటున్నారు అధికారులు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి రాష్ట్రంలో గత 5 రోజుల్లో 4 రెట్లకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ రేట్ కూడా 3శాతంపైగా పెరుగుతుంది. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

తెలంగాణలో రోజురోజుకు క్రమంగా కేసులు పెరుగుతున్నాయి.. వరుసగా మూడో రోజూ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. నిన్న వెయ్యి దాటిన కేసులు ఇవాళ రెండు వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో 54,534 కరోనా టెస్టులు చేయగా.. 1,913 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,87,456కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 1214 కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 4,036కు చేరింది. కరోనా నుంచి మంగళవారం 232 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,847 ఐసోలేషన్, యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు.

Telangana Corona

Telangana Corona

పెరుగుతున్న కేసుల నేపథ్యంలో రాష్ట్రం, దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు చెప్పారు. అయితే, నమోదయ్యే కేసుల్లో తీవ్ర ప్రభావం లేదని.. ఆస్పత్రుల్లో ఎక్కడ ఎక్కువ సంఖ్యలో రోగులు చేరడం లేదన్నారు. ఒమిక్రాన్ బారిన పడిన వారు 5 రోజుల్లోనే కోలుకుంటున్నారని చెప్పారు. సంక్రాంతికి కేసులు మరింత పెరిగే ప్రమాదముందని.. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు వచ్చే 4 వారాలు అన్ని కార్యక్రమాలు ఫోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్పారు. ఆంక్షల వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కనుక.. కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజలంతా వైద్యఆరోగ్య శాఖకు సహకరిస్తే ఫిబ్రవరి నెలలో మళ్లీ కేసులు తగ్గే అవకాశం ఉందని డీహెచ్ హెచ్చరించారు.

ప్రజారోగ్యాన్ని దృష్టిపెట్టుకొని ప్రజారోగ్య సిబ్బందికి నేటి నుంచి సెలవులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు డీహెచ్. ప్రజలంతా వైద్య ఆరోగ్య శాఖకు సహకరించి.. కరోనా మహమ్మారిని పారదోలడానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అడ్మిషన్ ప్రొటోకాల్ పాటిస్తున్నామని.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీవ్ర అనారోగ్యానికి గురైన వారిని మాత్రమే చేర్చుకోవాలని అధికారులను ఆదేశించారు డీహెచ్. థార్డ్ వేవ్ లో కరోనా సోకిన వారికి కేవలం సింప్టమాటిక్ చికిత్స ఇస్తే సరిపోతుందని చెప్పారు. అనవసరంగా మొల్నుఫిరావిర్, కాక్టాయిల్ వంటి చికిత్సలు తీసుకోవద్దని సూచించారు డీహెచ్. ఒమిక్రాన్ వేరియంట్ పేరు చెప్పి అనవసరంగా పేదల నుంచి డబ్బు గుంజితే చర్యలు తప్పవని హెచ్చరించారు డీహెచ్ శ్రీనివాసరావు.