కరోనా కట్టడికి ఇక కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందే..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో కేసుల తీవ్రత పెరుగుతోందన్నారు.

కరోనా కట్టడికి ఇక కేంద్రం జోక్యం చేసుకోవాల్సిందే..
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2020 | 7:09 PM

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందన్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో కేసుల తీవ్రత పెరుగుతోందన్నారు. అంతేకాదు.. హైదరాబాద్‌ ఇప్పుడు డేంజర్‌ జోన్‌లో ఉందని.. పరిస్థితి చేయి దాటకముందే కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్రానికి ఓ లేఖ కూడా రాశారు. కరోనా కట్టడికి కేంద్రం నుంచి ప్రత్యేక అధికారుల్ని రాష్ట్రానికి పంపాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాటికి  4111 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1817 కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2138 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు 156 మంది మరణించారు.