AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసోలేషన్ వార్డులో క‌రోనా సోకిన యువతి టిక్‌టాక్‌..మరో ముగ్గురికి షాక్

టిక్‌టాక్ పిచ్చి పీక్ స్టేజీకి వెళ్లింది అన‌టానికి ఇది చ‌క్క‌టి నిద‌ర్శ‌నం. ఎందుకంటే.. ఓ యువ‌తి క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొంతున్న‌ప్ప‌టికీ టిక్‌టాక్‌ను వ‌దులుకోలేదు. ఐసోలేష‌న్ వార్డులోనే మ‌రో ముగ్గురు సిబ్బందితో క‌లిసి టిక్‌టాక్ వీడియో చేసింది.

ఐసోలేషన్ వార్డులో క‌రోనా సోకిన యువతి టిక్‌టాక్‌..మరో ముగ్గురికి షాక్
Jyothi Gadda
|

Updated on: Apr 01, 2020 | 3:24 PM

Share
టిక్‌టాక్ పిచ్చి పీక్ స్టేజీకి వెళ్లింది అన‌టానికి ఇది చ‌క్క‌టి నిద‌ర్శ‌నం. ఎందుకంటే.. ఓ యువ‌తి క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొంతున్న‌ప్ప‌టికీ టిక్‌టాక్‌ను వ‌దులుకోలేదు. ఐసోలేష‌న్ వార్డులోనే మ‌రో ముగ్గురు సిబ్బందితో క‌లిసి టిక్‌టాక్ వీడియో చేసింది. అది ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. దీంతో ఆమె చేసిన ప‌నికి నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆస్ప‌త్రి సిబ్బంది,.. అధికారుల‌కు మాత్రం కొత్త త‌ల‌నొప్పిని తెచ్చిపెట్టింది. వివ‌రాల్లోకి వెళితే…
త‌మిళ‌నాడులోని అరియలూర్ జిల్లాకు చెందిన ఓ యువతి చెన్నైలోని ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది. ఖాళీ దొరికినప్పుడల్లా టిక్‌టాక్ వీడియోలు చేస్తూ.. ఎప్పుడూ బీజీగా ఉంటుంది. ఇటీవల ఆమె జ్వరం, దగ్గు లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది. టెస్టులు చేసిన వైద్యులు క‌రోనా సోకిన‌ట్లుగా నిర్ధారించారు. మార్చి 26నుంచి ఆమెను అరియలూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఐసోలేషన్ వార్డులో ఉన్న బాధిత మహిళ మార్చి 28న టిక్‌టాక్ వీడియో చేసింది. ఓ బాధాకరమైన పాటను ఎంచుకొని కరోనాతో తాను ఎలాంటి తిప్పలు పడుతున్నానో వివరించింది.
ఒంటరిగా ఉండటంతో ఏమీ తోచటం లేదు.. అభిమానులను ఎంత‌గానో మిస్సవుతున్నాను అంటూ..ఆ యువతి తన టిక్‌టాక్ వీడియోలో పేర్కొంది. దగ్గు కారణంగా ఎక్కువ సేపు మాట్లాడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో పండ్లు, కోడి గుడ్లు అందిస్తున్నారని.. గొంతు నొప్పి కారణంగా ఏమీ తినలేకపోతున్నానని ఆమె తన ఫాలోవర్లకు తెలిపింది. అయితే, ఆ వీడియో చేయడానికి వార్డులోని ముగ్గురు సిబ్బంది కూడా సహకరించారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆమెకు సహకరించిన ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. వారిని కూడా వెంటనే క్వారంటైన్‌కు తరలించారు.

హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
హీరోయిన్స్ డ్రెస్‌సెన్స్‌పై శివాజీ షాకింగ్ కామెంట్స్
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. ఇవి తెలుసుకోకపోతే ఇబ్బందే
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
Video: కీర్తితో కలిసి డ్యాన్స్ అదరగొట్టిన స్టార్ హీరో భార్య..
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
ఒక్క రాత్రికి 3 కోట్లు.. ఈ భామ బిజినెస్ రేంజ్ మామూలుగా లేదుగా!
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
వెయ్యి కోట్లు దాటేసిన క్రేజీ బ్యూటీ.. టాప్ 5లో ఊహించని పేర్లు
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
కూతురు పెళ్లి కబురుతో షాకిచ్చిన సీనియర్​ హీరో.. ఊహించని ట్విస్ట్!
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
సంక్రాంతి స్పెషల్ రైళ్ల షెడ్యూల్స్ వచ్చేశాయి.. వివరాలు ఇవే..
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
టెక్నాలజీతో దోస్తీ.. రోబోలతో పోటీ.. మీ పిల్లలను ఇలా రెడీ చేయండి
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్
భారత్ బయోటెక్ మరో ఘనత.. మరో వ్యాధికి వ్యాక్సిన్