కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించాలంటూ అమెజాన్ కార్మికుల నిరసన..

కరోనా వైరస్ నుంచి తమకు తమ సంస్థ రక్షణ కల్పించాలని, మాస్కులు వంటి వివిధ సాధనాలను ఇవ్వాలంటూ అమెజాన్ కార్మికులు నిరసనకు దిగారు. మా సంస్థ తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు ఏమాత్రం సరిపోవని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్మికుల్లో క్రిస్టియన్ స్మాల్స్ అనే వర్కర్ తన ఆందోళనను తీవ్రం చేయడంతో అమెజాన్ యాజమాన్యం అతడ్ని విధుల నుంచి తొలగించింది. తమ నిబంధనలను  అతడు ఉల్లంఘించాడని ఆరోపించింది. అయితే క్రిస్టియన్ స్మాల్స్ తన […]

కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించాలంటూ అమెజాన్ కార్మికుల నిరసన..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 01, 2020 | 3:51 PM

కరోనా వైరస్ నుంచి తమకు తమ సంస్థ రక్షణ కల్పించాలని, మాస్కులు వంటి వివిధ సాధనాలను ఇవ్వాలంటూ అమెజాన్ కార్మికులు నిరసనకు దిగారు. మా సంస్థ తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు ఏమాత్రం సరిపోవని కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్మికుల్లో క్రిస్టియన్ స్మాల్స్ అనే వర్కర్ తన ఆందోళనను తీవ్రం చేయడంతో అమెజాన్ యాజమాన్యం అతడ్ని విధుల నుంచి తొలగించింది. తమ నిబంధనలను  అతడు ఉల్లంఘించాడని ఆరోపించింది. అయితే క్రిస్టియన్ స్మాల్స్ తన సహచరులైన మరికొందరు కార్మికులతో కలిసి ధర్నాకు పూనుకొన్నాడు. దీంతో న్యూయార్క్ లోని లెటీషియా జేమ్స్ అనే మహిళా లాయర్.. అతని తరఫున కోర్టులో వాదించేందుకు రెడీ అయింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంటిలోనే ఉండాలని తాము ఆదేశించినప్పటికీ.. స్మాల్స్ దాన్ని పాటించకుండా కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో కాంటాక్ట్ లోకి వచ్చాడని అమెజాన్ యాజమాన్యం చేసిన వాదనను ఆ న్యాయవాది తోసిపుచ్చారు. ఈ సంస్థ కార్మికుల హక్కులను అతిక్రమించిందా అన్న దానిపై తాము అన్ని లీగల్ ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నామని ఆమె తెలిపారు.అటు-మీ సంస్థ సిబ్బందికి తగినన్ని కరోనా ప్రొటెక్టివ్ ఈక్విప్ మెంట్ ను అందజేయాలని అమెరికన్ ఎంపీలు పలువురు ఈ సంస్థ బాస్ జెఫ్ బెజోస్ కి లేఖ రాశారు.