ఆన్లైన్ ద్వారా కరోనా టెస్ట్.. బుక్ చేసుకోండిలా..

Coronavirus Outbreak: కరోనా వైరస్ టెస్టులను ఇకపై ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రముఖ డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ ఫాం ప్రాక్టో ఇకపై కోవిడ్-19 టెస్టులను కూడా నిర్వహించనుంది. ఈ మేరకు కంపెనీ ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. కరోనా టెస్టులను నిర్వహించడానికి థైరోకేర్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ప్రాక్టో సంస్థ కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)ల అనుమతులను కూడా పొందింది. ఇవాళ నుంచి ఈ సేవలు […]

ఆన్లైన్ ద్వారా కరోనా టెస్ట్.. బుక్ చేసుకోండిలా..

Coronavirus Outbreak: కరోనా వైరస్ టెస్టులను ఇకపై ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రముఖ డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ ఫాం ప్రాక్టో ఇకపై కోవిడ్-19 టెస్టులను కూడా నిర్వహించనుంది. ఈ మేరకు కంపెనీ ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. కరోనా టెస్టులను నిర్వహించడానికి థైరోకేర్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ప్రాక్టో సంస్థ కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)ల అనుమతులను కూడా పొందింది.

ఇవాళ నుంచి ఈ సేవలు ముంబైలో ఉన్నవారికి అందుబాటులోకి రాగా.. త్వరలోనే దేశమంతా ఈ సేవలను విస్తరిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా కరోనా టెస్టును బుక్ చేసుకోవాలని అనుకున్నవారు.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఫిజీషియన్ సంతకం చేసిన టెస్ట్ ఫారం, ఫొటో ఐడీ కార్డులను సమర్పించాల్సి ఉంది. అటు టెస్ట్ ధర రూ. 4,500గా నిర్ధారించగా.. ప్రాక్టో, థైరోకేర్ వెబ్సైట్ ల నుంచి టెస్టుల కోసం బుకింగ్ చేసుకోవచ్చు.

అత్యంత నిపుణం కలిగిన డాక్టర్లు నేరుగా ఇంటికి వచ్చి శాంపిల్స్ సేకరిస్తారని పేర్కొంది. ఇక 24 నుంచి 48 గంటల్లో వాటికీ సంబంధించిన రిపోర్టులను ప్రాక్టో వెబ్ సైట్లో చూసుకోవచ్చని వివరించింది. కాగా, ప్రస్తుతం దేశంలో కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందువల్ల చాలామందికి టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని ప్రాక్టో చీఫ్ హెల్త్ స్ట్రాటజీ ఆఫీసర్ అలెగ్జాండర్ కురువిల్లా తెలిపారు. వైరస్ లక్షణాలు కనిపించిన ప్రతీ ఒక్కరికి టెస్టులు జరిగేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇవి చదవండి:

చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ.. విదేశాల్లో ట్రయిల్స్..

చైనా మాస్క్‌లు, టెస్టింగ్ కిట్స్ నాసిరకం.. తిప్పి పంపేస్తున్న దేశాలు.!

ఏపీలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్యధికం..

Click on your DTH Provider to Add TV9 Telugu