కరోనా రోగులే ముఖ్యం.. పెళ్లి కాదు.. కేరళ మహిళా డాక్టర్ సేవా గుణం

తన కుమార్తె అభ్యర్థనను తాము వెంటనే అంగీకరించామని ఆయన చెప్పారు. ఆయన ఎన్సీపీ నేత కూడా.. తన పెళ్లి జరగాల్సిన రోజున ఆ పెళ్లి బట్టలతోనే ఈ మహిళా డాక్టర్ రోగులకు సేవ చేయడం విశేషం.

కరోనా రోగులే ముఖ్యం.. పెళ్లి కాదు.. కేరళ మహిళా డాక్టర్ సేవా గుణం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 01, 2020 | 2:58 PM

గత నెల (మార్చి) 29 ఆదివారం ఆ మహిళా డాక్టర్ పెళ్లి .. దుబాయ్ కి చెందిన ఓ వ్యాపారితో ఆమె వివాహం ఆ రోజున జరగాల్సి ఉంది. కానీ కరోనా రోగుల చికిత్సలో ఉన్న ఆమె తన మ్యారేజీ కన్నా.. ఈ రోగుల చికిత్సే తనకు ముఖ్యమని అంటోంది. కేరళకు చెందిన 23 ఏళ్ళ డాక్టర్ షఫి మహమ్మద్ గొప్ప గుణమిది.. ప్రస్తుతం కన్నూర్ లోని పెరియారం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో… ఐసొలేషన్ వార్డుల్లోని కరోనా రోగులకు నిర్విరామంగా ఆమె చికిత్స చేస్తోంది. ‘పెళ్లిని వాయిదా వేయవచ్చుగానీ ఈ వార్డుల్లో తమ ప్రాణాలకోసం పోరాడుతున్న రోగుల ట్రీట్ మెంట్ ను పోస్ట్ పోన్ చేయలేం కదా’ అని ఆమె వ్యాఖ్యానించింది. ఆమె నిర్ణయాన్ని ఆమె తలిదండ్రులు, అటు దుబాయ్ లో ఆమెకు కాబోయే వరుడు కూడా హర్షించారు. ఇది స్వాగతించదగిన నిర్ణయమని డాక్టర్ షఫి తండ్రి ముక్కం మహమ్మద్ అన్నారు. తన కుమార్తె అభ్యర్థనను తాము వెంటనే అంగీకరించామని ఆయన చెప్పారు. ఆయన ఎన్సీపీ నేత కూడా.. తన పెళ్లి జరగాల్సిన రోజున ఆ పెళ్లి బట్టలతోనే ఈ మహిళా డాక్టర్ రోగులకు సేవ చేయడం విశేషం. అయితే ఇదేమీ తన గొప్పదనం కాదని, తనలాగే ఇంకా ఎంతోమంది తమ ముఖ్యమైన రోజుల్లో ఆయా కార్యక్రమాలను కూడా వాటిని వాయిదా వేసుకుని తమ సేవా గుణాన్ని చాటుకుంటూ ఉంటారని షఫి పేర్కొంది.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..