పీపీఈ కిట్లలో నాణ్యత లోపం…పొంచివున్న ప్రమాదం !
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత సంరక్షణ పరికరాలు పీపీఈ కిట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వైరస్ నుంచి కాపాడేందుకు వినియోగించే రక్షణ కవచాలు నాసిరకంగా ఉన్నాయని పలువురు నిపుణులు ఆరోపిస్తున్నారు.

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత సంరక్షణ పరికరాలు పీపీఈ కిట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పలు దేశాలు విదేశాల నుంచి పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేస్తున్నాయి. కరోనా విస్తరిస్తున్న క్రమంలోనే తెలంగాణలోనూ పీపీఈ కిట్ల అవసరం అత్యధికంగా ఏర్పడింది. దీంతో విరివిగా పీపీఈ కిట్లను సేకరించాల్సి వచ్చింది. అయితే, ఇక్కడే మరో చిక్కు వచ్చిపడింది. వైరస్ నుంచి కాపాడేందుకు వినియోగించే రక్షణ కవచాలు నాసిరకంగా ఉన్నాయని పలువురు నిపుణులు ఆరోపిస్తున్నారు.
పీపీఈ కిట్ల నాణ్యతా లోపం
నాణ్యతలేని పీపీఈ కిట్ల కారణంగా వైద్యులు కరోనా బారిన పడే ప్రమాదం ఉందని ఏఎస్ ఐ (అసోసియేషన్ ఆఫ్ సర్జెన్స్ ఆఫ్ ఇండియా) ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలైన ధరలో మూడింత ఒక్కవంతు ధరకు లభ్యమయ్యే , తక్కువ నాణ్యత కలిగిన పీపీఈ లను మార్కెట్లలో నింపిన అనాధికార తయారీ దారులపై ఈ సంస్థ మండిపడుతోంది. ఇది ఆరోగ్య సంరక్షణ నిపుణుల భద్రతకు పెద్ద ముప్పుగా వాటిళ్లనుందని ఆందోళన వ్యక్తం చేసింది. వైద్య నిపుణులకు అవసరమైన పీపీఈలను సేకరించడానికి మొదట్లో దేశంలో 19 సంస్థలకు మాత్రమే ప్రభుత్వ అనుమతి పొందిన తయారీదారులు ఉన్నారని చెప్పింది. ఏఎస్ ఐ సంస్థ తెలిపింది. (ఇది మార్చి వరకు ఉన్న లెక్కల ప్రకారం) అయితే, రాష్ట్రంలో పీపీఈ ల తీవ్ర కొరత నేపథ్యంలో చాలా మంది ప్రైవేటు వ్యక్తులు, వస్త్ర వ్యాపారులు ఇంకా సంబంధిత సంస్థలు పీపీఈ ల సేకరణలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారని ఏఎస్ ఐ ప్రెసిడెంట్ డా. పి.రఘురామ్ తెలిపారు.
ఏఎస్ ఐ ప్రెసిడెంట్ డా. పి.రఘురామ్ గారి వివరణ..
తక్కువ నాణ్యత గల పీపీఈ కిట్లను కొన్ని ఆస్పత్రులు రూ. 300 నుంచి రూ. 600లకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. నాణ్యత కొరవడిన పీపీఈ కిట్లు అత్యంత ప్రమాదకారివిగా ఆయన హెచ్చరించారు. అనుమతి పొందిన కిట్ల ధర సుమారు రూ. 2 వేల వరకు ఉంటుందని చెప్పారు. ఏఎస్ ఐ తమ డాక్టర్ల కోసం బెంగళూరులోని ఐఎస్‌వో సర్టిఫైడ్ తయారీదారుల నుండి నాణ్యమైన పీపీఈ ల కోసం రూ. 77 లక్షలు వెచ్చించినట్లుగా ఆయన తెలిపారు. కోవిడ్ విస్తరిస్తున్న క్రమంలో పీపీఈల కొరత తీవ్రంగా ఉన్నప్పుడు మేము పీపీఈ లను సేకరించడం ప్రారంభించామని, కార్మికుల రక్షణ కోసం డబుల్ లేయర్ ఉన్న కిట్లను వాడాలని సూచించినట్లుగా మరో ప్రైవేటు ఆస్పత్రి వైద్యాధికారులు చెబుతున్నారు.
స్టేట్ లేవల్ కమిటీ నిర్ధారణ తర్వాతే ..
ప్రస్తుతం..పీపీఈ కిట్ల కొరత కారణంగా గతంలో పీపీఈ కిట్లను కొనుగోలు చేయాల్సి వచ్చిందని టీఎస్ ఎమ్ ఐడీసీ చైర్మెన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అయితే, పీపీఈ కిట్లలో నాణ్యతలోపం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పడు మాత్రం 70గ్రాముల మందంతో కూడిన పీపీఈ కిట్లను మాత్రమే ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు అనుమతిస్తున్నట్లుగా వెల్లడించారు. అన్ని శాంపిల్స్‌ని సీఎస్ ఆర్ ఆధ్వర్యంలో స్టేట్‌లేవల్ కమిటీ పరీక్షించి నిర్ధారించిన తర్వాతే వినియోగిస్తున్నట్లుగా తెలిపారు.




