మాజీ ఎంపీ కవిత చొరవః స్వస్థలాలకు 23 మంది తెలంగాణ యువతులు
మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చొరవతో 23 మంది తెలంగాణ యువతకు సాయం అందింది.

మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చొరవతో 23 మంది తెలంగాణ యువతకు సాయం అందింది. ఇన్ని రోజులుగా సోలాపూర్‌లో ఇబ్బందులు పడ్డ యువత ట్విట్టర్ ద్వారా కవితకు విన్నవించారు. దానికి స్పందించిన కవిత వారికి తగిన ఏర్పాట్లు చేసి, సహాయ సహకరాలు అందజేశారు.
లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలోని సోలాపూర్ లో చిక్కుకున్న 68 మంది తెలంగాణ యువతులు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో వారి స్వస్థలాలకు చేరుకున్నారు. తెలంగాణ లోని వివిధ జిల్లాలకు చెందిన 68 మంది యువతులు లాక్ డౌన్ కారణంగా మహారాష్ట్రలోని సోలాపూర్ లో చిక్కుకుపోయారు. యువతులందరినీ అక్కడి ఒక ప్రైవేటు కాలేజీలో వసతి ఏర్పాటు చేశారు. అయితే 23 రోజులుగా ఇరుకు గదుల్లో ఎక్కువ మంది ఉండటం, కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో యువతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
అయితే , యువతి కుటుంబ సభ్యుల్లో ఒకరు, వారి సమస్యలను ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కవిత గారికి వివరించి, సహాయం చేయాల్సిందిగా కోరారు. దానిపై వెంటనే స్పందించిన మాజీ ఎంపీ కవిత, యువతులు తెలంగాణ కు వచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. 3 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయించిన మాజీ ఎంపీ కవిత, బస్సుల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. 68 మంది యువతులు బుధవారం వారి స్వస్థలాలకు చేరుకున్నారు.
యువతులను క్వారంటైన్ లో ఉంచేలా సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు. కోరిన వెంటనే స్పందించి, స్వస్థలాలకు చేరుకునేలా సహాయం చేసిన మాజీ ఎంపీ కవిత గారికి యువతులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.