లాక్‌డౌన్‌పై యాంకర్ రవి స్పెషల్ టాక్‌ షో.. ఎందులో అంటే?

ఇప్పుడున్న లాక్‌డౌన్ పరిస్థితుల్లో అందరూ ఎంటర్‌టైన్మెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఫోన్స్‌లో, లాప్‌టాప్స్‌లో కామెడీ, ఎంటర్‌ టైన్మెంట్ షోలను, సినిమాలను చూస్తున్నారు. దీంతో ఇలాంటి సమయంలో అందరినీ పలకరించడానికి ఒక సరికొత్త టాక్‌షో..

లాక్‌డౌన్‌పై యాంకర్ రవి స్పెషల్ టాక్‌ షో.. ఎందులో అంటే?
TV9 Telugu Digital Desk

| Edited By:

May 06, 2020 | 5:48 PM

ఇప్పుడున్న లాక్‌డౌన్ పరిస్థితుల్లో అందరూ ఎంటర్‌టైన్మెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఫోన్స్‌లో, లాప్‌టాప్స్‌లో కామెడీ, ఎంటర్‌ టైన్మెంట్ షోలను, సినిమాలను చూస్తున్నారు. దీంతో ఇలాంటి సమయంలో అందరినీ పలకరించడానికి ఒక సరికొత్త టాక్‌షోతో ముందుకొచ్చింది ఓ టీవీ ఛానెల్. ఈ టాక్‌ షో ద్వారా టాలీవుడ్‌ యాక్టర్లు, టీవీ నటులు వారి క్వారంటైన్ జీవితం గురించి, లాక్‌డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారో మనకు తెలియజేయనున్నారు.

ఇక ఈ జోష్ ఫుల్ షోకి యాంకర్‌గా రవి వ్యవహరించనున్నాడు. ప్రేక్షకులకు ఫుల్ ఫన్ అందించడంలో, తన ఫన్నీ సెటైర్స్‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడంలో తిరుగులేని యాంకర్‌గా పేరు తెచ్చుకున్న రవి ‘లాక్‌డౌన్ టాక్స్ విత్ రవి’తో మరోసారి ప్రేక్షకుల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నాడు. ఈ షో మే 9వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి ప్రతీ శని, ఆది వారాలు జీ తెలుగు ఛానెల్‌లో రానుంది.

ఈ ప్రోగ్రామ్‌లో భాను శ్రీ, ధన్‌రాజ్, అందిరింది ఫేమ్ వేణు, విశ్వా, తదితర నటీనటులు రాబోతున్నారు. ఈ షోలోని వారందరూ మన అందరితో ఎన్నో విషయాలు పంచుకుంటారు. ఆడుతూ, పాడుతూ, వంట చేస్తూ, అల్లరి కూడా చేస్తారు. ఇదే కాకుండా యాంకర్ రవి కూడా తన క్వారంటైన్ టైం గురించి పలు విషయాలు చెప్పనున్నాడు.

Read More:

టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు అనుమతిచ్చిన కర్నాటక ప్రభుత్వం

బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..

తెలంగాణలో వైన్ షాపులకు క్లియర్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu