దారుణం..కరోనా నుంచి కోలుకున్న తల్లిని ఇంట్లోకి రానివ్వని కొడుకు

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ బాధితులకు కష్టాలు తీరటం లేదు. మొన్నామధ్య కాలంలో కరోనా బారినపడ్డ ఓ వృద్ధుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నాడు..కానీ అతన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు కుటుంబీకులు నిరాకరించిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. తాజాగా అటువంటిదే మరో ఘటన వెలుగు చూసింది.

దారుణం..కరోనా నుంచి కోలుకున్న తల్లిని ఇంట్లోకి రానివ్వని కొడుకు
Follow us

|

Updated on: Jul 25, 2020 | 2:49 PM

కరోనా నుంచి కోలుకున్నప్పటికీ బాధితులకు కష్టాలు తీరటం లేదు. మొన్నామధ్య కాలంలో కరోనా బారినపడ్డ ఓ వృద్ధుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నాడు. కానీ, అతన్నిఇంటికి తీసుకువెళ్లేందుకు మాత్రం అతడి కుటుంబీకులు నిరాకరించారు. గాంధీ వైద్యాధికారుల సమాచారం మేరకు అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. చివరకు తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఘటనపై స్పందించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, తాజాగా హైదరాబాద్ నగరంలో అటువంటిదే మరో సంఘటన వెలుగు చూసింది. కరోనా నుంచి కోలుకుని ఇంటికి వచ్చిన ఓ మహిళకు కొడుకు, కోడలు చుక్కలు చూపించారు.

హైదరాబాద్‌ ఫిలింనగర్‌‌లోని బీజేఆర్‌ నగర్‌కు చెందిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ కాగా, ఆమె గాంధీ ఆసుపత్రిలో చేరింది.. కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో శుక్రవారం సాయంత్రం ఆమెను ఆస్పత్రి నుంచి డాక్టర్లు డిశ్ఛార్జ్‌ చేశారు. దీంతో కరోనాను జయించి తాను, క్షేమంగా బయటపడ్డందుకు బాధితురాలు ఎంతో సంతోషించింది. కానీ, ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ మహిళను కొడుకు, కోడలు ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. అంతటితో ఆగలేదు..ఇంటిపై కప్పుకున్న రేకులు కూడా ధ్వంసం చేసి.. ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో చేసేదేమీ లేక ఆ బాధితురాలు రోడ్డు పక్కనే బిక్కు బిక్కుమంటూ రాత్రంతా గడిపింది. తనకు న్యాయం చేయాలంటూ భాదితురాలు అధికారులను వేడుకుంటోంది.