ఒడిషాలో విజృంభిస్తోన్న కరోనా.. తాజాగా 1,320 పాజిటివ్ కేసులు..
ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్యలు పెరుగుతున్నాయి. అన్‌లాక్ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసుల వందల సంఖ్య నుంచి వేలల్లోకి చేరాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా..

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్యలు పెరుగుతున్నాయి. అన్‌లాక్ 1.0 తర్వాత రాష్ట్రంలో కేసుల వందల సంఖ్య నుంచి వేలల్లోకి చేరాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,320 కరోనా పాజిటివ్ కేసుల నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శనివారం నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 24,013కి చేరింది. వీటిలో 15,200 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,650 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 130 మంది మరణించారు.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13లక్షలు దాటాయి. వీటిలో కరోనా నుంచి కోలుకుని 8.49 లక్షలకు మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 4.5 లక్షలు యాక్టివ్ కేసులు ఉన్నాయి.
1,320 new #COVID19 positive cases have been reported in Odisha, taking the total number of cases to 24,013 including 15,200 recoveries and 8,650 active cases. Death toll rises to 130 with 10 new deaths reported: State Health Department
— ANI (@ANI) July 25, 2020



