Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అగ్రరాజ్యాలతో పోటీగా.. కరోనా వాక్సిన్ తయారీలో భారత్ ధీటైన పోటీ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు కృషి చేస్తున్నాయి. భారత్‌లోనూ ఆరు సంస్థలు టీకా తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో అనేక సవాళ్లు ఉంటాయని..

అగ్రరాజ్యాలతో పోటీగా.. కరోనా వాక్సిన్ తయారీలో భారత్ ధీటైన పోటీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 16, 2020 | 10:14 AM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు కృషి చేస్తున్నాయి. భారత్‌లోనూ ఆరు సంస్థలు టీకా తయారు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే క్రమంలో అనేక సవాళ్లు ఉంటాయని.. వాటిని ఎదుర్కొని విరుగుడు అందుబాటులోకి రావాలంటే చాలా కాలం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జైడస్ కాడిలా రెండు వ్యాక్సిన్‌లపై ప్రయోగాలు చేస్తోంది. సీరమ్ ఇనిస్టిట్యూట్, బయోలాజికల్ ఈ, భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యూనాలాజికల్స్, మైన్‌ వ్యాక్స్ లాంటి ఆరు సంస్థలు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయని గగన్‌దీప్ కాంగ్, టీహెచ్‌ఎస్‌టీఐ పేర్కొన్నారు.

కాగా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడమంటే దీర్ఘకాల ప్రక్రియ అని రాజీవ్‌గాంధీ జీవ సాంకేతిక కేంద్రంలోని శాస్త్రవేత్త శ్రీకుమార్ అన్నారు. వివిధ దశల పరీక్షలను దాటేందుకు, ప్రభుత్వాల ఆమోదం పొందేందుకు నెలల సమయం పడుతుందన్నారు. కాగా వ్యాక్సిన్ తాయారైన తర్వాత కూడా అనేక సవాళ్ల ఉంటాయన్నారు. అన్ని వయస్సుల వారిపై ఇది పని చేస్తుందా? లేదా జన్యు నిర్మాణాన్ని మార్చుకునే క్రమంలో దాన్ని ఎదుర్కోగలదా? వంటి సమస్యలు తలెత్తుతాయని శ్రీకుమార్ చెబుతున్నారు.

కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)ప్రకారం.. 70 సంస్తలు వ్యాక్సిన్ తయారీపై కృషి చేస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌వో జాబితాలో జైడస్ కాడిలా, సీరమ్ ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయి. అలాగే అటు అమెరికా, చైనా కూడా వ్యాక్సిన్‌ని తయారు చేసేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని రకాల వ్యాక్సిన్‌లు తయారు చేసి జంతువులపై, కొందరి మనుషులపై ప్రయోగించాయి. అయితే అవి అంతగా సక్సెస్ కాలేదని అమెరికా, చైనా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

Read More: ‘రాజముద్ర’ను మార్చేసిన ఏపీ సీఎంవో.. కారణం అదేనా?

వెయ్యి పడకల ఆస్పత్రిని మూసేసిన చైనా