షాకింగ్ న్యూస్: సింగర్స్ సునీత, మాళవికలకు కరోనా పాజిటివ్
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తరుచుగా ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఇక ఇప్పటికే ప్రముఖ సింగర్ బాల సుబ్రమణ్యం కరోనా మహమ్మారితో...

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోన్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికే ఎంతో మంది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తరుచుగా ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఇక ఇప్పటికే ప్రముఖ సింగర్ బాల సుబ్రమణ్యం కరోనా మహమ్మారితో పోరాడుతున్నారు. ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు సింగర్స్ సునీత, మాళవికలకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్టు రిపోర్టుల్లో తేలింది. ఇటీవలే వీరిద్దరూ ఓ టీవీ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అందులోనే వారికి ఈ వైరస్ సోకినట్టుగా సమాచారం. అప్పటికే వారిలో కరోనా లక్షణాలు ఉండగా.. పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం వీరు డాక్టర్ల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉండి, చికిత్స తీసుకుంటున్నారు.
Read More:
రాజీవ్ ఖేల్‌రత్నకు నామినేట్ అయిన రోహిత్ శర్మ
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి
మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు



