ఒడిషాలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు
ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచన 24 గంటల్లో కొత్తగా మరో 2,239 కరోనా పాజిటివ్ కేసులు..
ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా గడిచన 24 గంటల్లో కొత్తగా మరో 2,239 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,533కి చేరింది. వీటిలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 43,779 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 20,339 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 362 మంది మరణించారు.
కాగా, దేశ వ్యాప్తంగా రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మంగళవారం నాటికి 27.02 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో కరోనా నుంచి కోలుకుని 19.77 లక్షల మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 6.73 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
9 deaths and 2,239 fresh #COVID19 cases reported in Odisha in the last 24 hours, taking the total number of confirmed cases in the state to 64,533 including 20,339 active cases, 43,779 recovered cases and 362 deaths: State Health Department
— ANI (@ANI) August 18, 2020
Read More :



