నాసిక్‌ను ముంచెత్తిన వానలు..
నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. నాసిక్ ప్రాంతంలో ఈ ఉదయం కుండపోత వర్షం కురసింది...
నైరుతి రుతు పవనాలు సకాలంలో దేశంలోకి ప్రవేశించటంతో వానలు ముంచెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని చాలా ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నాసిక్ ప్రాంతంలో కుండపోత వర్షం కురసింది. దీంతో ఆ నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని నీట మునిగాయి. రహదారులన్నీ నదులను తలపించాయి. కొన్నిచోట్లు నడుముల లోతు నీరు నిలచిపోవటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. రంగంలోకి దిగిన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ప్రభావానికి తోడు భారీ వర్షం కురియటంతో జనం బిక్కు బిక్కు మంటూ ఇళ్లకే పరిమితమయ్యారు.
Maharashtra: Severe waterlogging in parts of Nashik, following heavy rainfall today. pic.twitter.com/zbWTOtWjVC
— ANI (@ANI) June 15, 2020