ఒకే రోజు.. ఒకే ఆసుపత్రిలో.. 32 మంది వైద్య సిబ్బందికి కరోనా
కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులకు వైరస్ సోకడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది వైద్య సిబ్బంది, పోలీసులు కరోనా బారిన పడ్డారు.
కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న వైద్య సిబ్బంది, పోలీసులకు వైరస్ సోకడం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ఎంతోమంది వైద్య సిబ్బంది, పోలీసులు కరోనా బారిన పడ్డారు. వీరిలో కొంతమంది చనిపోగా.. మరికొంత మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పేట్ల బురుజు ప్రసూతి ఆసుపత్రిలో ఒకే రోజు 32 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడం హైదరాబాద్‌లో కలకలం రేపుతోంది. అందులో 18 మంది వైద్యులు, 14 మంది సిబ్బంది ఉన్నారు. ఇదిలా ఉంటే తెలంగాణలో ప్రజా ప్రతినిధుల్లో సైతం కరోనా టెన్షన్ ఎక్కువవుతోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Read This Story Also: మమ్మల్ని క్షమించు సుశాంత్.. మనసును కదిలిస్తున్న మీరా చోప్రా ఎమోషనల్ పోస్ట్