గుడ్‌న్యూస్‌… క‌రోనాను అంతంచేయ‌గ‌ల 69 మందులుః శాస్త్ర‌వేత్త‌లు

క‌రోనా వైర‌స్ అంతానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌నే సంకేతాలు అందుతున్నాయి. కోవిడ్ భూతాన్ని త‌రిమికొట్ట‌గ‌లిగే వ్యాక్సిన్ సిద్ద‌మైన‌ట్లుగా తెలుస్తోంది. శాస్త‌వేత్త‌లు చేసిన తాజా ప్ర‌క‌ట‌న అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతోంది. క‌రోనాకి చెక్ పెట్ట‌డంలో ...

గుడ్‌న్యూస్‌... క‌రోనాను అంతంచేయ‌గ‌ల 69 మందులుః శాస్త్ర‌వేత్త‌లు
Follow us

|

Updated on: Mar 23, 2020 | 3:19 PM

క‌రోనా వైర‌స్ అంతానికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయ‌నే సంకేతాలు అందుతున్నాయి. కోవిడ్ భూతాన్ని త‌రిమికొట్ట‌గ‌లిగే వ్యాక్సిన్ సిద్ద‌మైన‌ట్లుగా తెలుస్తోంది. శాస్త‌వేత్త‌లు చేసిన తాజా ప్ర‌క‌ట‌న అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపుతోంది. క‌రోనాకి చెక్ పెట్ట‌డంలో దాన్ని నియంత్రించడంలో 69 రకాల మందులు ప‌నిచేస్తాయ‌ని ప్ర‌క‌టించారు. ప్రస్తుతం రెండు డజన్ల మందుల్ని కరోనా వైరస్‌పై ఎక్కువగా ప్రయోగిస్తున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

క‌రోనాని అరిక‌ట్ట‌క‌లిగే 69 మందుల్లో కొన్నింటిని శాస్త్ర‌వేత్త‌లు ప్ర‌క‌టించారు. మలేరియాను తరిమికొట్టే క్లోరోక్విన్ (chloroquine) కూడా ఆ లిస్టులో ఉంది. ఈ క్లోరోక్విన్ ఫాస్పేట్ అనే మందు చైనాలో కరోనా వైరస్‌ని కట్టడి చెయ్యడంలో బాగా పనిచేసింద‌ని స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూడా క‌రోనాకు మ‌లేరియా వ్యాక్సిన్‌తో ట్రీట్‌మెంట్ ఫ‌లితానిస్తుంద‌నే ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రో సంద‌ర్బంలో ఎయిడ్స్ రోగుల‌కు వాడే మందుల‌తోనూ క‌రోనాను అరిక‌ట్ట‌వ‌చ్చ‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఇక ఇప్పటివరకూ ప్రయోగిస్తున్న మందులన్నీ వేర్వేరు రోగాల్ని నయం చేసేందుకు ఉన్నవే. ప్రత్యేకించి కరోనా వైరస్‌ని నివారించేందుకు ఇంకా ఎటువంటి వాక్సిన్ రాలేదు. అయితే, ఈ 69 మందుల్లో ఏవైతే… కరోనాను బాగా తరమగలవో గుర్తించి, వాటిని కరోనా వైరస్ వ్యాక్సిన్‌గా కూడా తయారుచేస్తారు. అప్పుడు దానికి ప్రత్యేక పేరు కూడా పెడతార‌ని అంచానా.

బయోఆర్జివ్ (bioRxiv) జర్నల్‌లో 69 మందుల వివరాల్ని రాశారు. ఈ లిస్టులో మందుల్ని… వందల మంది పరిశోధకులు… కరోనా వైరస్ జన్యువులపై ప్రయోగించి చూశారు. ఊపిరితిత్తుల్లో ఏ కణాన్నైనా నాశనం చెయ్యాలంటే… ముందుగా కరోనా వైరస్… దాని జన్యువును అందులోకి పంపాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కణం నుంచీ వైరస్ ప్రోటీన్స్ ఉత్పత్తి అవుతాయి. అలా కొన్ని కోట్ల కరోనా వైరస్ ఉత్పత్తి అవుతుంది. అంటే… మన శరీరంలో కరోనా వైరస్ పెరగాలంటే… కచ్చితంగా మన కణాల్ని అది వాడుకోక తప్పదు. కరోనా వైరస్‌కి 29 జన్యువులు ఉన్నాయి. వాటిలో 26 జన్యువులపై తాజాగా ఓ పరిశోధన జరిగింది. ఈ పరిశోధనలో వైరస్ ఉత్పత్తి ఎలా జరుగుతుందో అర్థమైంది. ఈ వైరస్ ఉత్పత్తి జరగకుండా ఆపేందుకు 24 రకాల గుర్తింపు పొందిన డ్రగ్స్ బాగా పనిచేస్తున్నాయని సైంటిస్టులు అంటున్నారు. వీటిలో కాన్సర్, పార్కిన్సన్స్, హైపర్ టెన్షన్‌ను తగ్గించే డ్రగ్స్ కూడా ఉన్నాయి.

ఈ 69 మందుల లిస్టులో స్కిజోఫ్రీనియాకి ఇచ్చే హాలోపెరిడోల్ (haloperidol), టైప్ 2 డయాబెటిస్‌కి ఇచ్చే మెట్ఫార్మిన్ (metformin) కూడా ఉన్నాయి. 69 లిస్టులో కొన్ని మందులైతే… కరోనా వైరస్… ఏ కణాలను వాడుకుంటుందో… ఆ కణాలను చుట్టుముట్టి… కణాలను నాశనం చేయగలవట. అలా జరిగినప్పుడు వైరస్‌కి కణం లేక అది చచ్చిపోతుందన్నమాట.

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!