దీదీ సర్కార్‌కు గవర్నర్‌ ఝలక్‌..!

వెస్ట్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రంలో పరిపాలన సరిగ్గాలేదని మండిపడ్డారు. పోలీసులు, అధికారులు లాక్‌డౌన్‌ ప్రోటోకాల్‌ను సరిగా పాటించడంలేదన్నారు. దేశ వ్యాప్తంగా ఓ వైపుక కరోనా విజృంభిస్తుంటే.. వైరస్‌ నియంత్రణ చర్యల్లో మమతా సర్కార్‌ ఫెయిల్‌ అయ్యిందన్నారు. ప్రజలకు సోషల్ డిస్టెన్స్‌ ఎలా ఉండాలన్న దానిపై కనీస అవగాహన కల్పించడంలో కూడా విఫలమైందని.. గవర్నర్‌ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. […]

దీదీ సర్కార్‌కు గవర్నర్‌ ఝలక్‌..!
Follow us

| Edited By:

Updated on: Apr 15, 2020 | 7:01 PM

వెస్ట్ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీరుపై గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రంలో పరిపాలన సరిగ్గాలేదని మండిపడ్డారు. పోలీసులు, అధికారులు లాక్‌డౌన్‌ ప్రోటోకాల్‌ను సరిగా పాటించడంలేదన్నారు. దేశ వ్యాప్తంగా ఓ వైపుక కరోనా విజృంభిస్తుంటే.. వైరస్‌ నియంత్రణ చర్యల్లో మమతా సర్కార్‌ ఫెయిల్‌ అయ్యిందన్నారు. ప్రజలకు సోషల్ డిస్టెన్స్‌ ఎలా ఉండాలన్న దానిపై కనీస అవగాహన కల్పించడంలో కూడా విఫలమైందని.. గవర్నర్‌ తన అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

అంతేకాదు… కరోనా మహమ్మారి నియంత్రణకు లాక్‌డౌన్‌ అమలు చేయలేకపోతే.. తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి కేంద్ర పారామిలిటరీ బలగాలను తెప్పించుకోవాలని మమతా సర్కార్‌కు గవర్నర్‌ సూచించారు. ఇక దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రజలంతా లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించాలని కోరుతోంది.

Latest Articles