AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..

యావత్ ప్రపంచాన్ని కోవిద్-19 మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా ఇప్పటికే ప్రపంచదేశాలన్నీ కూడా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తబ్లీఘీ జమాత్ సమావేశంతో ఇటు ఇండియా, అటు పాకిస్తాన్‌లలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అంతేకాక పాకిస్తాన్‌లో ఎక్కువ కేసులు తబ్లీఘీ, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినవారి వల్లే నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇక పాక్ సర్కార్ ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించగా.. దాన్ని బేఖాతర్ […]

ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..
Ravi Kiran
|

Updated on: Apr 16, 2020 | 12:30 PM

Share

యావత్ ప్రపంచాన్ని కోవిద్-19 మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఈ వైరస్‌ను నియంత్రించడంలో భాగంగా ఇప్పటికే ప్రపంచదేశాలన్నీ కూడా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తబ్లీఘీ జమాత్ సమావేశంతో ఇటు ఇండియా, అటు పాకిస్తాన్‌లలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది.

అంతేకాక పాకిస్తాన్‌లో ఎక్కువ కేసులు తబ్లీఘీ, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చినవారి వల్లే నమోదైనట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. ఇక పాక్ సర్కార్ ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించగా.. దాన్ని బేఖాతర్ చేస్తూ.. మత గురువులు ప్రతీ రోజూ మసీదుల్లో నమాజ్‌ను నిర్వహిస్తున్నారని.. దీనికి వేలాది సంఖ్యలో పాకిస్తానీ హాజరవుతున్నారని వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా పట్టించుకోవట్లేదని.. ‘వైరస్‌కు భయపడేది లేదని.. అల్లా ఎప్పుడూ తమతో ఉన్నారని’ చెబుతున్నట్లు నిత్యం నమాజ్‌కు హాజరయ్యే ముల్తాన్‌కు చెందిన సాబిర్ దుర్రాని అనే వ్యక్తి తెలిపాడు. రోజూ చాలామంది మసీదులో ప్రార్ధనలకు వస్తున్నారని.. ఒక్కరు కూడా మాస్క్ ధరించడం లేదన్నాడు.

ఆ వైరస్ వెస్ట్రన్ పీపుల్‌ను సోకినట్లు మనకు రాదు. నిత్యం మనం ఐదుసార్లు చేతులు, ముఖాన్ని నమాజ్ చేసే ముందు కడుక్కుంటాం. అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదని.. అల్లా ఎప్పుడూ తమతో ఉన్నారని.. అవసరమైతే ప్రాణాలైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని.. కానీ మసీదులను మాత్రం విడిచిపెట్టమని ముస్లిం మత గురువులు చెప్పినట్లు దుర్రాని పేర్కొన్నాడు. కాగా, పాకిస్తాన్‌లో మతం అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ.. ఇక మరో రెండు వారాల్లో రంజాన్ మాసం కూడా ప్రారంభం కానుండటంతో.. అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

Also Read: ‘అక్కడ ముస్లింలకు వైద్యం చేయరట’.. ఓవైసీ ఫైర్.. ‘కమ్యూనల్ వైరస్’ అంటూ ట్వీట్…

Follow Us
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన సీఎం
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభించిన సీఎం
వైభవ్ బౌలింగ్ యాక్షన్‌పై యువరాజ్ ఫన్నీ కామెంట్
వైభవ్ బౌలింగ్ యాక్షన్‌పై యువరాజ్ ఫన్నీ కామెంట్
సినిమాలు ఫ్లాప్ అయితే కోట్లకు కోట్లు తిరిగి ఇచ్చేశాడు
సినిమాలు ఫ్లాప్ అయితే కోట్లకు కోట్లు తిరిగి ఇచ్చేశాడు
కార్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి..? దీని వల్ల లాభాలేంటి..?
కార్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి..? దీని వల్ల లాభాలేంటి..?
చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడని బుద్దిమంతుడనుకునెరు..
చూడ్డానికి అమాయకుడిలా ఉన్నాడని బుద్దిమంతుడనుకునెరు..
OTTలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 8.3/10 రేటింగ్
OTTలో దుమ్మురేపుతోన్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 8.3/10 రేటింగ్
కదులుతున్న ట్రక్కులో 105 కిలోల చికెన్ ఎత్తుకెళ్లిన దొంగలు! వీడియో
కదులుతున్న ట్రక్కులో 105 కిలోల చికెన్ ఎత్తుకెళ్లిన దొంగలు! వీడియో
ఆస్ట్రియా యువరాణితో బిలావల్ భుట్టో వివాహం..?
ఆస్ట్రియా యువరాణితో బిలావల్ భుట్టో వివాహం..?
సక్సెస్ కావాలా? మెదడుకు ఈ ఒక్క అలవాటు నేర్పించండి!
సక్సెస్ కావాలా? మెదడుకు ఈ ఒక్క అలవాటు నేర్పించండి!
కృష్ణాష్టమి వేళ అద్భుతం:ఒకే రేఖపై ఐదు గ్రహాలు..వీరికి స్వర్ణయుగమే
కృష్ణాష్టమి వేళ అద్భుతం:ఒకే రేఖపై ఐదు గ్రహాలు..వీరికి స్వర్ణయుగమే