Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘అక్కడ ముస్లింలకు వైద్యం చేయరట’.. ఓవైసీ ఫైర్.. ‘కమ్యూనల్ వైరస్’ అంటూ ట్వీట్…

దేశవ్యాప్తంగా రెండోదశ లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ముస్లింలకు తాము వైద్యం చేయమంటూ కరీంనగర్‌లోని ఓల్గా పిల్లల ఆసుపత్రి ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తన చెల్లెలు పాపకు బాగోలేదని.. చికిత్స కోసం అపాయింట్‌మెంట్‌ తీసుకోవడానికి మ‌హ్మ‌ద ఇషాదుద్దీన్ అనే వ్యక్తి ఫోన్ చేయగా.. ముస్లింలకు ఇక్కడ వైద్యం చేయరని ఆసుపత్రి సిబ్బంది’ చెప్పే ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన మజ్లిస్ బచావో టేహ్రీక్(ఎంబీటీ) నేత అంజ‌దుల్లా ఖాన్… […]

'అక్కడ ముస్లింలకు వైద్యం చేయరట'.. ఓవైసీ ఫైర్.. 'కమ్యూనల్ వైరస్' అంటూ ట్వీట్...
Follow us
Ravi Kiran

| Edited By:

Updated on: Apr 16, 2020 | 12:32 PM

దేశవ్యాప్తంగా రెండోదశ లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ముస్లింలకు తాము వైద్యం చేయమంటూ కరీంనగర్‌లోని ఓల్గా పిల్లల ఆసుపత్రి ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘తన చెల్లెలు పాపకు బాగోలేదని.. చికిత్స కోసం అపాయింట్‌మెంట్‌ తీసుకోవడానికి మ‌హ్మ‌ద ఇషాదుద్దీన్ అనే వ్యక్తి ఫోన్ చేయగా.. ముస్లింలకు ఇక్కడ వైద్యం చేయరని ఆసుపత్రి సిబ్బంది’ చెప్పే ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై స్పందించిన మజ్లిస్ బచావో టేహ్రీక్(ఎంబీటీ) నేత అంజ‌దుల్లా ఖాన్… మంత్రి కేటీఆర్, తెలంగాణ డీజీపి, కరీంనగర్ కమీషనర్‌లను ట్యాగ్ చేసి.. ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉంటే ఈ తతంగంపై ఆసుపత్రి వర్గాలు స్పందించాయి. హాస్పిటల్‌లోని రిసెప్షన్ స్టాఫ్ అవగాహన లేక ఓపీ సేవలు బంద్ చేశామని చెప్పాల్సింది పోయి.. అలా చెప్పారని.. కొద్దిసేపటి తర్వాత తాను స్వయంగా ఇషాదుద్దీన్‌కు కాల్ చేసి వాళ్ల పాపకు చికిత్స కూడా అందించామని డాక్టర్ సుజాత తెలిపారు.

‘ ఆడియో వైరల్ అయిన తర్వాత.. ఆసుపత్రి డాక్టర్ తమకు ఫోన్ చేసి పిలిచారని.. పాపకు చికిత్స చేయడమే కాకుండా జరిగిన దానికి క్షమాపణలు కూడా చెప్పారని మ‌హ్మ‌ద ఇషాదుద్దీన్ అన్నాడు. అటు కరీంనగర్ కమీషనర్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఎంక్వయిరీ మొదలుపెట్టామని.. ల్యాబ్‌లో పని చేసే ముస్లిం వ్యక్తి ఫోన్ కాల్ అటెండ్ చేసి ఇక్కడ ముస్లింలకు వైద్యం చేయరని చెప్పినట్లు గుర్తించామన్నారు.

కాగా.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దీనిపై ట్వీట్ చేశారు. ‘ఈ ‘కమ్యూనల్ వైరస్‌’పైన వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేదంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని తెలిపారు. సరైన రీతిలో దీనిపై యాక్షన్ తీసుకోకపోతే.. అమాయకులైన ముస్లిం జీవితాలు ప్రమాదంలో పడతాయని అన్నారు.

Also Read: ప్రాణాలు వదిలేస్తాం కానీ.. మసీదును విడిచిపెట్టం..