సూపర్ మార్కెట్‌కు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
దేశం మొత్తం ఎంత లాక్డౌన్ లో ఉన్న తినడానికి నిత్యావసరాలను తప్పనిసరి. అయితే సూపర్మార్కెట్లు, దుకాణాలు నుంచి వస్తువులను కొనే సమయంలోనూ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే మార్కెట్లకు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ జాగ్రత్తలు ఏంటో ఒక్కసారి చూద్దాం బయటకు వెళ్లాలనుకున్నప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోండి. ఏ మాత్రం నలతగా ఉన్నా అడుగు బయట పెట్టొద్దు. పక్కళ్లవారి సాయం కోరండి. మరీ […]

దేశం మొత్తం ఎంత లాక్డౌన్ లో ఉన్న తినడానికి నిత్యావసరాలను తప్పనిసరి. అయితే సూపర్మార్కెట్లు, దుకాణాలు నుంచి వస్తువులను కొనే సమయంలోనూ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే మార్కెట్లకు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆ జాగ్రత్తలు ఏంటో ఒక్కసారి చూద్దాం
- బయటకు వెళ్లాలనుకున్నప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసుకోండి. ఏ మాత్రం నలతగా ఉన్నా అడుగు బయట పెట్టొద్దు. పక్కళ్లవారి సాయం కోరండి. మరీ ఇబ్బందిగా ఉంటే పోలీసుల సాయాన్ని అర్థించండి.
- బయటకు వెళ్తున్నప్పుడు మాస్క్ తప్పనిసరి అని గుర్తుంచుకోండి. శానిటైజర్ ఉంటే మరీ మంచింది
- ఇంట్లో నుంచి ఒక్కరే మాత్రమే బయటకు వెళ్లండి. ముందుగా ఏమేం సరకులు లిస్ట్ రాసుకోండి. ముందుగా ఉప్పు, పప్పులు, చక్కెర వంటి కిరాణా సరకులు తీసుకోవాలి. తర్వాత పాలు, పెరుగు వంటివి.. చివరిగా మాంసం ఉత్పత్తులు తీసుకోండి.
- ముఖ్యమైన విషయం భౌతిక దూరం పాటించడం. ఇతర వ్యక్తులకు 6 అడుగుల దూరంలో ఉండటం అత్యంత ఉత్తమమైన పని.
- ముఖాన్ని చేతులతో అసలు తడుముకోవద్దు. ఆడవాళ్లు జత్తు ముఖంపై పడకుండా ముడి పెట్టుకోవడం ఉత్తమం.
- బిల్లింగ్ వద్ద జాగ్రత్త అత్యవసరం. డైరెక్ట్ బ్యాంక్ పేమెంట్స్, గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటివి ఉపయోగించండి.ఇంటికి రాగానే ముందుగా చేతులు సబ్బుతో, శానిటైజర్ తో మో చేతుల వరకు శుభ్రంగా కడుక్కోండి.
- ఆ తర్వాత కూరగాయలు, పండ్లను ఉప్పునీళ్లలో 20 నిమిషాలు ఉంచి ఆ తర్వాత ప్రిజ్ లో పెట్టండి