భక్తులకు శుభవార్త: జూన్ 14 నుంచి అయ్యప్ప దర్శనం..నియమాలు తప్పనిసరి

కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయ ద్వారాలు త్వరలోనే తెరుచుకోనున్నాయి. టోకెన్ విధానం అమలు చేస్తూ...శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ శనివారం వెల్లడించారు. దాదాపు మూడు నెలల అనంతరం

భక్తులకు శుభవార్త: జూన్ 14 నుంచి అయ్యప్ప దర్శనం..నియమాలు తప్పనిసరి
Follow us

|

Updated on: Jun 06, 2020 | 5:22 PM

కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయ ద్వారాలు త్వరలోనే తెరుచుకోనున్నాయి. టోకెన్ విధానం అమలు చేస్తూ…శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ శనివారం వెల్లడించారు. దాదాపు మూడు నెలల అనంతరం నెలవారీ పూజల కోసం జూన్ 14 అయ్యప్ప ఆలయం తెరుచుకోనుండగా.. ఐదు రోజుల పాటు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

మలయాలం మాసమైన మిథునం 15నుంచి ప్రారంభంకానుండడంతో ఆచారం ప్రకారం భక్తులు మాసపూజ, శబరిమల ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఈ నెల 28 వరకు ఆలయాన్ని తెరువనున్నట్లు దేవస్థానం మంత్రి కడకంపల్లి సురేంద్రన్ తెలిపారు. ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు. గంటకు కేవలం 200 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తామని, విర్చువల్ క్యూ విధానం పాటిస్తామని తెలిపారు. రద్దీని నియంత్రించడానికి సన్నిధానం ముందు 50 మందినే అనుమతిస్తామని తెలిపారు.

స్వామి దర్శనానికి ముందు పంబ, సన్నిధానంలో థర్మల్ స్కానింగ్ చేయనున్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, శానిటైజేషన్ వెంట తెచ్చుకోవాలని మంత్రి సూచించారు. శబరిమలలో భక్తులకు ఎలాంటి వసతి కల్పించమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ప్రభుత్వ కోవిడ్ జాగ్రత్త రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రస్తుతం కేరళ భక్తులకు మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. లాక్‌డౌన్ తర్వాత కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా ఆలయంలోకి భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు.