‘Omicron’ variant: ఓమిక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త వ్యాక్సిన్‌.. అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైన గమలేయ కేంద్రం

ఓమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో రష్యా ఒక అడుగు ముందుకు వేసింది. కరోనా కొత్త వేరియెంట్ ఓమైక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది.

'Omicron' variant: ఓమిక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త వ్యాక్సిన్‌..  అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైన గమలేయ కేంద్రం
Sputnik Vaccine
Follow us

|

Updated on: Nov 30, 2021 | 9:30 AM

‘Omicron’ coronavirus variant: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకునేలోపే ఓమిక్రాన్ అనే మరో కొత్త వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తింపబడ్డ ఈ వైరస్.. ఆ తర్వాత ఐరోపా ఆసియా దేశాల్లో కూడా కేసులు బయటపడ్డాయి. దీంతో మరోసారి ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇది పలు రకాలుగా రూపాంతరం చెందుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నవారిలో కూడా ఇది ప్రభావం చూపే ఆస్కారం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆయా దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించడమే కాకుండా వారి దేశాల్లో కరోనావైరస్‌కు తయారవుతున్న వ్యాక్సిన్ ఎంతమేరకు ఓమిక్రాన్ వైరస్‌ను నిలువరించగలదనేదానిపై వ్యాక్సిన్ తయారీదారులతో ప్రభుత్వాలు చర్చిస్తున్నాయి.

ఈ క్రమంలో రష్యా ఒక అడుగు ముందుకు వేసింది. కరోనా కొత్త వేరియెంట్ ఓమైక్రాన్‌కు వ్యతిరేకంగా రష్యా కొత్త కొవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడం ప్రారంభించింది. కొవిడ్ ఓమైక్రాన్ వేరియంట్‌ను లక్ష్యంగా చేసుకొని స్పుత్నిక్ వ్యాక్సిన్ కొత్త వెర్షన్‌ను అభివృద్ధి చేసేందుకు రష్యా గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ సిద్ధమైంది. స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌లు ఓమైక్రాన్ వేరియంట్‌ను అడ్డుకోగలదన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని గమలేయా కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త స్పుత్నిక్ ఒమైక్రాన్ వెర్షన్ 45 రోజుల్లోనే భారీ ఉత్పత్తికి సిద్ధంగా ఉంటామని రష్యా ప్రకటించింది. 2022 ప్రారంభంలో స్పుత్నిక్ ఒమైక్రాన్ బూస్టర్ షాట్‌లు పెద్ద మొత్తంలో అంతర్జాతీయ మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చని రష్యా వైద్య శాఖ భావిస్తోంది.

మరోవైపు, ఓమైక్రాన్ వేరియంట్ ప్రమాదం చాలా ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పరివర్తన చెందిన కరోనావైరస్ తీవ్ర పరిణామాలతో వేగంగా వ్యాప్తి చెందుతుందని డబ్లూహెచ్‌ఓ పేర్కొంది. దక్షిణాఫ్రికాలోని పరిశోధకులు వేరియంట్‌ని గుర్తించిన కొద్ది రోజులకే విదేశీ సందర్శకులందరి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు అయా దేశాలు ప్రకటిస్తున్నాయి. మొరాకో అన్ని ఇన్‌కమింగ్ విమానాలను నిషేధించింది. అమెరికా, జపాన్, యూరోపియన్ లతో సహా ఇతర దేశాలు దక్షిణాఫ్రికా నుంచి వచ్చే ప్రయాణికులను నిషేధించాయి. ఇదిలావుంటే, వైరస్ భయపడినట్లుగా ప్రమాదకరమని రుజువైతే జనాభాపై దీని ప్రభావం గణనీయంగా ఉంటుంది. కాని ముఖ్యంగా తక్కువ టీకా కవరేజ్ ఉన్న దేశాల్లో ఓమైక్రాన్‌తో సంబంధం ఉన్న మరణాలు సంభవించలేదని డబ్లూహెచ్‌ఓ పేర్కొంది. Read Also…  Kevin Pietersen: అందుకే భారత్ అత్యంత అద్భుతమైన దేశం.. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ఇంగ్లాండ్ క్రికెటర్..