కరోనా వ్యాప్తికి తబ్లీఘీయే కారణం.. మండిపడుతున్నమరో సీఎం..

కరోనా వ్యాప్తికి తబ్లీఘీయే కారణం.. మండిపడుతున్నమరో సీఎం..

దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నమోదైన కరోనా కేసులకు కారణం తబ్లీఘీ జమాతేనే కారణమంటూ మండిపడ్డారు గుజారత్‌ సీఎం విజయ్‌ రూపానీ. ముఖ్యంగా తమ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంత పెద్ద ఎత్తున పెరగడానికి తబ్లీఘీ జమాత్‌ సంస్థనే కారణమంటూ ఆరోపించారు. తబ్లీఘీ జమాత్‌ సమావేశానికి వెళ్లి వచ్చాక.. వారి వివరాలను దాచిపెట్టడంతోనే కేసుల తీవ్రత పెరిగిందన్నారు. ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌ను రెండుగా విభజించి కరోనా కట్టడికి యత్నిస్తున్నామని.. అందులో పాత […]

TV9 Telugu Digital Desk

| Edited By:

May 03, 2020 | 8:02 PM

దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నమోదైన కరోనా కేసులకు కారణం తబ్లీఘీ జమాతేనే కారణమంటూ మండిపడ్డారు గుజారత్‌ సీఎం విజయ్‌ రూపానీ. ముఖ్యంగా తమ రాష్ట్రంలో కరోనా కేసులు ఇంత పెద్ద ఎత్తున పెరగడానికి తబ్లీఘీ జమాత్‌ సంస్థనే కారణమంటూ ఆరోపించారు. తబ్లీఘీ జమాత్‌ సమావేశానికి వెళ్లి వచ్చాక.. వారి వివరాలను దాచిపెట్టడంతోనే కేసుల తీవ్రత పెరిగిందన్నారు. ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌ను రెండుగా విభజించి కరోనా కట్టడికి యత్నిస్తున్నామని.. అందులో పాత అహ్మదాబాద్, కొత్త అహ్మదాబాద్‌ అని.. అందులో 90 శాతం జనాభా ఉంటే, పాత అహ్మదాబాద్ లో 10 శాతం జనాభా ఉన్నారన్నారు. అయితే తబ్లీఘీ జమాత్‌ సభ్యులు వివరాలు దాచిపెట్టడంతో.. 90 శాతం కేసులు పది శాతం ఉన్న జనాభాలోనే నమోదైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అహ్మదాబాద్‌, సూరత్‌ ప్రాంతాల్లో తబ్లీఘీ సభ్యులు ఎక్కువగా పర్యటించారని.. అయితే ఇప్పటికీ కూడా వారు తమ వివరాలను దాచిపెడుతున్నారని రూపానీ ఆరోపించారు.

కాగా.. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు ఇదే వ్యాఖ్యలు చేశారు. అందులో తాజాగా యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ కూడా కరోనా కేసులకు తబ్లీఘీ జమాతే కారణమంటూ ఆరోపణలు చేశారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu