యూపీలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. తాజా వివరాలు ఇవే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నలభై వేలకు చేరువలో ఉండగా.. వెయ్యికి పైగా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో పదివేల మంది కరోనా మహమ్మారిని జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. అయితే ఈ కేసులు ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, యూపీ వంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఉత్తర ప్రదేశ్‌లో కరోనా కట్టడికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నా.. […]

యూపీలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు.. తాజా వివరాలు ఇవే..
Follow us

| Edited By:

Updated on: May 03, 2020 | 7:23 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నలభై వేలకు చేరువలో ఉండగా.. వెయ్యికి పైగా కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో పదివేల మంది కరోనా మహమ్మారిని జయించి ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. అయితే ఈ కేసులు ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, యూపీ వంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఉత్తర ప్రదేశ్‌లో కరోనా కట్టడికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నా.. కేసులు మాత్రం క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆదివారం నమోదైన కేసుల వివరాలను ఉత్తర్‌ ప్రదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఇవాళ కొత్తగా మరో 92 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,579కు చేరుకుంది. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 43 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని.. 698 మంది ఆస్ప్రత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,838 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.