AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్ కీలక నిర్ణయం.. ఈ నెల 6న వారి ఖాతాల్లోకి రూ.10 వేలు..

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. లాక్‌ డౌన్, చేపల వేటపై నిషేధం కారణంగా ఈ ఏడాది మూడు నెలలపాటు ఉపాధి

జగన్ కీలక నిర్ణయం.. ఈ నెల 6న వారి ఖాతాల్లోకి రూ.10 వేలు..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 03, 2020 | 6:20 PM

Share

AP government: కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. లాక్‌ డౌన్, చేపల వేటపై నిషేధం కారణంగా ఈ ఏడాది మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. మత్స్యకారులకు విరామ భృతి అందించే కార్యక్రమాన్ని ఈ నెల 6వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఒక్కో మత్స్యకారుడికి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం రూ.10 వేలు జమ చేయనుంది.

కాగా.. ఏపీ ప్రభుత్వం సదరు జాబితాలో ఈ భృతికి అర్హుల పేర్లు, వివరాలను పొందుపరచి, గ్రామ సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. దీని వల్ల మొత్తం 1.09 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వం మార్చి 24న లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో అప్పటి నుంచి సముద్రంలో చేపల వేటను మత్స్యకారులు నిలిపివేశారు. ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో వేటను నిషేధించింది. ఈ రెండు కారణాలతో సముద్రంలో చేపల వేటకు అవకాశం లేకపోయింది.

అయితే.. ఈ క్రమంలో పనులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వీరికి విరామ సాయం అందించాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

Also Read: గుడ్ న్యూస్: నెల రోజుల్లో కరోనా వ్యాక్సిన్.. భారత్ నుంచే..!

Follow Us