Coronavirus: ఒమిక్రాన్ బారిన పడి కోలుకున్న వారికి ఉపశమనం.. పరిశోధనల్లో తేలిన ఆసక్తికర విషయాలు..
Coronavirus: కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషుల ఆరోగ్యాలను దెబ్బ తీసిన ఈ మాయదారి రోగం, దేశాల ఆర్థిక వ్యవస్థలను సైతం...
Coronavirus: కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనుషుల ఆరోగ్యాలను దెబ్బ తీసిన ఈ మాయదారి రోగం, దేశాల ఆర్థిక వ్యవస్థలను సైతం తలకిందులు చేసింది. ఇక ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువేనని చెప్పాలి. ఇదిలా ఉంటే కరోనా బారిన పడి కోలుకున్న తర్వాత కూడా వైరస్ ప్రభావం కొనసాగుతూనే ఉంది. కోలుకున్న తర్వాత కూడా కొందరిలో లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనినే లాంగ్ కొవిడ్ (దీర్ఘకాల కొవిడ్)లక్షణాలు అంటారు. ఇలాంటి వారిలో తీవ్ర అలసట, ఆయాసం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఇదిలా ఉంటే శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ వల్ల దీర్ఘకాల కొవిడ్-19 వచ్చే అవకాశాలు తక్కువ అని పరిశోధనల్లో తేలింది. ఈ వివరాలను ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్‌లో ప్రచురించారు. సాధారణంగా కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాలుగు వారులు లేదా అంత కంటే ఎక్కువ కాలం రోగ లక్షణాలు కొనసాగితే దానిని లాంగ్ కోవిడ్ అంటారు.
డెల్టాతో పోల్చితే, ఒమిక్రాన్ వేరియంట్‌లో దీర్ఘకాల కొవిడ్ వచ్చే అవకాశాలు 20 నుంచి 50 శాతం తక్కువని పరిశోధనల్లో తేలింది. ఒమిక్రాన్ కేసులో కేవలం 4.4 శాతం మంది మాత్రమే లాంగ్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతుంటే, డెల్టా బాధితుల్లో 10.8 శాతం దీర్ఘకాల కొవిడ్‌తో సతమతమవుతున్నారు.
మరిన్ని కరోనా సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి..