Coronavirus: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..
Coronavirus: గత కొన్ని రోజులుగా దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,923 కొత్త కేసులు నమోదయ్యాయి. మునుపటి రోజుతో పోలిస్తే కరోనా కేసులు 22.4 శాతం తగ్గాయి..
Coronavirus: గత కొన్ని రోజులుగా దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు మంగళవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,923 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన రోజుతో పోలిస్తే కరోనా కేసులు 22.4 శాతం తగ్గాయి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,33,19,396 చేరింది. ఇదిలా ఉంటే దేశంలో గడిచిన 24 గంటల్లో వైరస్ కారణంగా 17 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనా కారణంగా 5,24,890కి చేరింది. కొత్తగా 7,293 మంది రోగులు డిశ్చార్చి అయ్యారు.
దీంతో దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,27,15,193కి చేరింది. ప్రస్తుతం దేశంలో 79,313 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.61 శాతంగా ఉండగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.55 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో 2,786 కేసులు ఉంగా, మహారాష్ట్రలో 2,354, ఢిల్లీలో 1,060 కేసులు నమోదయ్యాయి. ఓవైపు కేసులు పెరుగుతూనే ఉండగా, మరోవైపు టీకాల పంపిణీ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 13,00,024 డోసుల వ్యాక్సిన్ వేయగా, ఇప్పటి వరకు 1,96,32,43,003 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.
మరిన్ని కరోనా వార్తల కోసం క్లిక్ చేయండి..