రోగికి పాజిటివ్‌..క్వారంటైన్ సెంట‌ర్ మూసివేత‌..!

గ‌ర్ల్స్ కాలేజీని ఇటీవ‌లే క్వారంటైన్ సెంట‌ర్ గా మార్చారు. అయితే అందులో ఉన్న వ్య‌క్తికి పాజిటివ్ గా తేల‌డంతో క్వారంటైన్ సెంట‌ర్

రోగికి పాజిటివ్‌..క్వారంటైన్ సెంట‌ర్ మూసివేత‌..!
Follow us

|

Updated on: May 15, 2020 | 4:12 PM

ఇక్క‌డ అక్క‌డా అని కాదు..క‌రోనా ఎక్క‌డికైనా పాకేస్తుంది. గుడి, బ‌డి, ప్ర‌భుత్వ‌, ప్రైవేటు అన్ని చోట్ల‌కు క‌రోనా వైర‌స్ వ్యాపిస్తోంది. క‌రోనా ర‌క్ష‌ణ క‌వ‌చాలుగా ప‌నిచేస్తున్న అనేక మంది వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు అనేక మందిని క‌రోనా వెంటాడుతోంది. దీంతో ఏ రూపంలో కోవిడ్ వైర‌స్ ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే, ఓ క్వారంటైన్ సెంట‌ర్‌లో ఉన్న రోగికి క‌రోనా పాజిటివ్‌గా తేల‌టంతో క్వారంటైన్ సెంట‌ర్‌నే మూసివేశారు అక్క‌డి అధికారులు. వివ‌రాల్లోకి వెళితే…
క‌రోనా నేప‌థ్యంలో మణిపూర్ లో ఏర్పాటు చేసిన‌ క్వారంటైన్ సెంట‌ర్ లో ఉన్న ఓ రోగికి క‌రోనా పాజిటివ్ గా  తేలింది. దీంతో క్వారంటైన్ సెంట‌ర్ ను మూసివేసిన అధికారులు గేట్ల‌కు తాళాలు వేశారు. మ‌ణిపూర్ ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలోని జామియా గ‌లినా అజిజ్ గ‌ర్ల్స్ కాలేజీని ఇటీవ‌లే క్వారంటైన్ సెంట‌ర్ గా మార్చారు. అయితే అందులో ఉన్న వ్య‌క్తికి పాజిటివ్ గా తేల‌డంతో క్వారంటైన్ సెంట‌ర్ ఉన్న ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్ గా నిర్దారించారు. క్వారంటైన్ కేంద్రం నిర్వ‌హిస్తోన్న భ‌వ‌నాన్ని పూర్తిగా మూసివేశారు.  పాజిటివ్ వ‌చ్చిన 31 ఏళ్ల వ్య‌క్తిని జ‌వ‌హ‌ర్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ లోని ఐసోలేష‌న్ వార్డుకు త‌ర‌లించారు అధికారులు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లా డిప్యూటీ క‌మిష‌న‌ర్ రంగిత‌బ‌లి వైఖోమ్ ఈ మేర‌కు వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..