పంజాబ్ పాఠశాలల్లో కరోనా కలకలం.. 13 మందికి పాజిటివ్… మరో 48 గంటలపాటు స్కూల్స్ మూసివేత

దేశ దేశాలకు విస్తరించిన కోవిడ్‌-19 భారత దేశాన్ని వణికిస్తోంది. వ్యాక్సిన్ రాకతో విముక్తి కలుగుతుందనుకుంటే అదే తీరును కొనసాగిస్తోంది.

పంజాబ్ పాఠశాలల్లో కరోనా కలకలం.. 13 మందికి పాజిటివ్... మరో 48 గంటలపాటు స్కూల్స్ మూసివేత
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 24, 2021 | 11:21 AM

Corona cases in Punjab schools : చైనాలో పుట్టి దేశ దేశాలకు విస్తరించిన కోవిడ్‌-19 భారత దేశాన్ని వణికిస్తోంది. వ్యాక్సిన్ రాకతో విముక్తి కలుగుతుందనుకుంటే అదే తీరును కొనసాగిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా మూతపడ్డ సంస్థలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం వైద్యాధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో పాఠశాలలు పునర్ ప్రారంభించడంతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది.

అమృత్‌సర్ నగరంలో 4వేల మంది పాఠశాల ఉపాధ్యాయులకు పరీక్షలు చేయగా, వారిలో 13 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. పాఠశాల ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో 48 గంటలపాటు పాఠశాలలను మూసివేసి, శానిటైజేషన్ చేపట్టారు. పంజాబ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి మార్చి 1వతేదీ నుంచి ఆంక్షలు విధించాలని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఇండోర్ లో 100మంది, అవుట్ డోర్ సమావేశాల్లో 200 మందికి మించకుండా చూడాలని సీఎం ఆదేశించారు. పంజాబ్ రాష్ట్రంలో కరోనాతో 15మంది మరణించారు. దేశంలో కొత్తగా కరోనా కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి కోవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

ఇదీ చదవండిః  దేశవ్యాప్తంగా మరోసారి గుబులు పుట్టిస్తున్న క‌రోనా మ్యుటేషన్‌… పెరుగుతున్న పాజిటివ్ కేసులు..!