దేశవ్యాప్తంగా మరోసారి గుబులు పుట్టిస్తున్న క‌రోనా మ్యుటేషన్‌… పెరుగుతున్న పాజిటివ్ కేసులు..!

గడిచిన 24 గంటల వ్యవధిలో 8.05లక్షల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 13,742 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది.

దేశవ్యాప్తంగా మరోసారి గుబులు పుట్టిస్తున్న క‌రోనా మ్యుటేషన్‌... పెరుగుతున్న పాజిటివ్ కేసులు..!
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 24, 2021 | 10:54 AM

India corona cases : భారత్‌లో మరోసారి కొత్తగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 8.05లక్షల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 13,742 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,30,176కి చేరుకుంది. కాగా, కరోనా మహమ్మారిని జయించి బుధవారం 14,037 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 1,07,26,702కు చేరింది. ఓవరాల్‌గా చూసుకుంటే, రికవరీ రేటు 97.25శాతంగా కొనసాగుతోంది.

ఇక, గడిచిన 24 గంటల్లో 104 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,56,567కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,46,907 యాక్టివ్ కేసుల ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తగ్గింది. ఇక మరణాల రేటు 1.42 శాతంగా కొనసాగుతోంది.

మరోవైపు, దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ జోరందుకుంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4.20లక్షల మందికి టీకా ఇచ్చారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం టీకా అందిన వారి సంఖ్య 1,21,65,598కి చేరింది.

Read Also…  దేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ల గుర్తింపు.. నిర్లక్ష్యం వహిస్తే దాడికి రెడీ.. అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు