AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19 India: పెరుగుతున్న కరోనా కేసులు.. అలర్ట్ అయిన కేంద్రం.. నేడు గవర్నర్లతో ప్రధాని మోదీ భేటీ..!

Corona Effect: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా మారుతోంది. దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరుగుతుండటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు..

Covid-19 India: పెరుగుతున్న కరోనా కేసులు.. అలర్ట్ అయిన కేంద్రం.. నేడు గవర్నర్లతో ప్రధాని మోదీ భేటీ..!
PM Narendra Modi
Shiva Prajapati
|

Updated on: Apr 14, 2021 | 9:20 AM

Share

Corona Effect: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా మారుతోంది. దేశంలో భారీ స్థాయిలో పెరుగున్న కరోనా కేసులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో.. దేశంలో కరోనా వ్యాప్తి, సంక్షోభ పరిస్థితుల గురించి గర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని నరేంద్ర మోదీ చర్చించనున్నారు. కాగా, ఈ వర్చువల్ సమావేశంలో ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు కూడా హాజరకానున్నారు.

ఇదిలాఉంటే.. రెండ్రోజుల క్రితం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ వర్చవల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని సమీక్షించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. కరోనా నివారణకై రాత్రి కర్ఫ్యూ విధించొచ్చని రాష్ట్రాలకు సూచించారు. అలాగే కరోనా టెస్టింగ్ సామర్థ్యం పెంచుకోవాలని ప్రధాని మోదీ.. ముఖ్యమంత్రులకు స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇక ఏప్రిల్ 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు కరోనా నియంత్రణకై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూలు విధించగా.. మరికొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇదే అంశంపై స్పందించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. లాక్‌డౌన్ విధింపుపై క్లారిటీ ఇచ్చారు. కేంద్రం ప్రభుత్వం లాక్‌డౌన్ విధించబోదని స్పష్టం చేశారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు.. ఎక్కడైతే వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉందో.. అక్కడ నియంత్రణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Also read:

YS Viveka Murder: వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో స్పీడ్ పెంచిన సీబీఐ.. నేడు మరికొంతమందిని ప్రశ్నించనున్న అధికారులు..

Ever Given Ship: ఎవర్‌ గివెన్‌కు వెంటాడుతున్న కష్టాలు.. పరిహారం చెల్లిస్తేనే వదిలేస్తామన్న ఈజిప్ట్‌ ప్రభుత్వం..