బ్రేకింగ్ః మ‌రింత క్షీణించిన మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం

బ్రేకింగ్ః మ‌రింత క్షీణించిన మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్యం

మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ(84) ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత క్షీణించింద‌ని ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ వెంటిలేట‌ర్ మీద చికిత్స తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 11, 2020 | 8:06 PM

మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ(84) ఆరోగ్య ప‌రిస్థితి మ‌రింత క్షీణించింద‌ని ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ వెంటిలేట‌ర్ మీద చికిత్స తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆరోగ్య ప‌రిస్థితిపై ఆర్మీ ఆస్ప‌త్రి వైద్యులు తాజాగా బులిటెన్ విడుద‌ల చేశారు. అయితే ఆయ‌న ఆరోగ్యంపై నిపుణుల వైద్యుల బృందం నిరంతరం ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని వైద్యులు తెలియ‌జేశారు.

కాగా మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి సోమ‌వారం‌ బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ కోసం చేసిన సర్జరీ చేసిన విష‌యం తెలిసిందే. అది విజ‌య‌వంతం అయిన‌ట్లు కూడా వైద్యులు వెల్ల‌డించారు. కాగా నిన్న‌ మ‌ధ్యాహ్నాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే క‌దా. ఆయన నార్మల్ చెకప్ కోసం హాస్పిట‌ల్‌కు వెళ్లారు. అయితే అక్కడ డాక్ట‌ర్లు క‌రోనా టెస్ట్ చేయగా.. పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. దీంతో వెంట‌నే ఆయ‌న ఆస్ప‌త్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

Read More:

రేణు దేశాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ల‌గ్జ‌రీ కార్లు అమ్మేసి!

‘క‌రోనా’ అనుభ‌వాలు మ‌న‌కు పాఠం నేర్పాయిః సీఎం కేసీఆర్

క్షీణించిన ఎంపీ న‌వ‌నీత్ కౌర్ ఆరోగ్యం! మ‌రో ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

కోవిడ్‌తో ప్ర‌ముఖ సినీ నిర్మాత మృతి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu