ప్రణబ్ కళ్లు స్పందిస్తున్నాయిః కూతురు శర్మిష్ఠా ముఖర్జీ
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కొద్దిగా మెరుగైనట్లు ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ తాజాగా ట్వీట్ చేశారు. ''గత రెండు రోజుల నుంచి ప్రణబ్ హెల్త్ కండీషన్ మరింత క్లిష్టంగానే ఉన్నప్పటికీ అది మరింత దిగజారలేదని..
భారత మాజీ రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని ఆర్మీ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్‌లో ప్రణబ్ ఆరోగ్యం గురించి ఆర్మీ ఆస్పత్రి వైద్యులు క్లారిటీ ఇచ్చారు. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలోనే ఉన్నారని, ఇంకా వెంటిలేటర్ మీదనే చికిత్స తీసుకున్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.
అయితే భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కొద్దిగా మెరుగైనట్లు ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ తాజాగా ట్వీట్ చేశారు. ”గత రెండు రోజుల నుంచి ప్రణబ్ హెల్త్ కండీషన్ మరింత క్లిష్టంగానే ఉన్నప్పటికీ అది మరింత దిగజారలేదని ఆమె పేర్కొంది. వెలుతురుకు ఆయన కళ్లు ప్రతి స్పందిస్తున్నాయని” ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ తన ట్వీట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
Without getting into medical jargons, whatever I could understand from last two days is that though my dads’ condition continues remain very critical, it hasn’t worsened. There’s little improvement in his eyes’ reaction to light.
तमसो मा ज्योतिर्गमय?
— Sharmistha Mukherjee (@Sharmistha_GK) August 14, 2020
Read More:
ఈ నెల 17 నుంచి ఇంటర్ ఆన్‌లైన్ తరగతులు
బ్రేకింగ్ః కరోనాను జయించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా