తమిళనాడులో కొత్తగా 5,890 పాజిటివ్ కేసులు
తమిళనాడులో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,890 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. లక్షలాదిమందిని ఆసుపత్రుల పాలు చేసిన కరోనా వైరస్ వేలాది మందిని బలి తీసుకుంటోంది. కరోనా మహమ్మారి ఇప్పట్లో బలహీనపడేలా కనిపించట్లేదు. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి.. అటు తమిళనాడులో కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 5,890 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇవాళ ఒక్కరోజే 117 మంది కరోనా బారిన పడి మరణించారు. దీంతో ఆ రాష్ట్రం మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,26,245కు చేరుకుంది. ఇక తమిళనాడు వ్యాప్తంగా కరోనా బారిన పడి 5,514 ప్రాణాలొదిలారు. కాగా, గత 24 గంటల్లో 5,556 మంది కరోనా వైరస్ ను జయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 53,716 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.