ఈ నెల 17 నుంచి ఇంట‌ర్ ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియ‌ట్ విద్యార్థుల చ‌దువులు పునఃప్రారంభం కానున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఇంట‌ర్ విద్యా బోధ‌న‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్నామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. డైరెక్టుగా కాలేజీలు తెరిచే అవ‌కాశం..

ఈ నెల 17 నుంచి ఇంట‌ర్ ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2020 | 6:38 PM

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియ‌ట్ విద్యార్థుల చ‌దువులు పునఃప్రారంభం కానున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో మారుతున్న ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఇంట‌ర్ విద్యా బోధ‌న‌కు ప్ర‌భుత్వం ప్ర‌త్నామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. డైరెక్టుగా కాలేజీలు తెరిచే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించాలనే నిర్ణ‌యం తీసుకుంది. దీంతో ఈ నెల 17వ తేదీ నుంచి ఇంట‌ర్ స్టూడెంట్స్‌కి ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని తెలంగాణ ఇంట‌ర్ బోర్డు శుక్ర‌వారం ఆదేశాలు జారీ చేసింది.

ప్ర‌భుత్వ‌, ఎయిడెడ్ క‌ళాశాల‌ల విద్యార్థుల‌కు డీడీ యాద‌గిరి, టీశాట్ ద్వారా ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని సూచించింది. అలాగే కాలేజీల ప్రిన్సిపాల్స్, జూనియ‌ర్ కాలేజీ లెక్చ‌ర‌ర్లు, ఫిజిక‌ల్ డైరెక్ట‌ర్స్, ఇత‌ర సిబ్బంది కాలేజీల‌కు హాజ‌రు కావాల‌ని తెలంగాణ ఇంట‌ర్ బోర్డు స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఇంట‌ర్మీడియ‌ట్ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న‌ర్ స‌య్య‌ద్ ఉమ‌ర్ జ‌లీల్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Read More:

బ్రేకింగ్ః క‌రోనాను జ‌యించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఓటీటీల్లో న‌టించేందుకు మెగాస్టార్ సిద్ధంః అల్లు అర‌వింద్‌

ఈ నెల 19న ఆంధ్రప్ర‌దేశ్‌ కేబినెట్ స‌మావేశం

రూ.33ల‌కే క‌రోనా ట్యాబ్లెట్లు