AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోదీ 2.0.. ప్రజలకు ప్రధాని లేఖ..

రెండవ పర్యాయం అధికారం చేపట్టి నేటికి మోదీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశప్రజలందరికి ప్రధాని నరేంద్రమోదీ బహిరంగలేఖ రాశారు. భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా తమ తొలి ఏడాది పాలన సాగిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజాయాలను ఆయన బహిరంగ లేఖలో గుర్తు చేశారు. చారిత్రాత్మక నిర్ణయాల ద్వారా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్న తరుణంలో […]

మోదీ 2.0.. ప్రజలకు ప్రధాని లేఖ..
Sanjay Kasula
|

Updated on: May 30, 2020 | 3:42 PM

Share

రెండవ పర్యాయం అధికారం చేపట్టి నేటికి మోదీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశప్రజలందరికి ప్రధాని నరేంద్రమోదీ బహిరంగలేఖ రాశారు. భారత్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా తమ తొలి ఏడాది పాలన సాగిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ ఏడాది కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన విజాయాలను ఆయన బహిరంగ లేఖలో గుర్తు చేశారు.

చారిత్రాత్మక నిర్ణయాల ద్వారా దేశం అభివృద్ధి పథంలో పయనిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా విరుచుకుపడ్డ ఈ కరోనా వైరస్ వల్ల వలస కూలీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిపై పోరులో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విధంగానే ఆర్ధిక పురోగతిని సాధించి కూడా ప్రపంచాన్ని భారత్ ఆశ్చర్యపరచడం ఖాయమని అన్నారు.

అధికరణ 370 రద్దు ప్రజల్లో ఏకత్వాన్ని, దేశ సమగ్రతను చాటిందని మోదీ తెలిపారు. శతాబ్దాలుగా పరిష్కారం దొరకని అయోధ్య రామమందిర వివాదం తన పాలనాకాలంలోనే సుప్రీంకోర్టు తీర్పుతో సద్దుమణగడం సంతోషంగా ఉందన్నారు. ముస్లిం మహిళల గౌరవ ప్రతిష్ఠలను కాపాడుతూ.. ట్రిపుల్‌ తలాక్‌ సంప్రదాయాన్ని చెత్తబుట్టలో వేశామని చెప్పుకొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం భారతదేశ దయాగుణాన్ని, సమ్మిళిత తత్వాన్ని తెలియజేస్తుందని లేఖలో వ్యాఖ్యానించారు.

రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడం భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే సువర్ణాధ్యాయం అని ఆయన అన్నారు. సర్జికల్‌ స్ట్రయిక్స్, బాలాకోట్ వైమానిక దాడుల ద్వారా భారత్‌ తన శక్తి ఏమిటో మరోసారి ప్రపంచానికి చాటిందని ప్రధాని మోదీ అన్నారు.

పేద, రైతు, మహిళ, యువత ఇలా అన్ని వర్గాల సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మోదీ లేఖలో వివరించారు. రైతులకు పెట్టుబడి సాయమందించే ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ ఇప్పుడు అందరు రైతులకు వర్తింపజేశామని తెలిపారు. ఈ పథకం కింద ఒక్క సంవత్సరం కాలంలోనే రూ.72 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామని గుర్తుచేశారు.

అనేక సంస్కరణలను ప్రభుత్వం తీసుకొచ్చిందని, వన్‌ ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌, వన్‌ నేషన్‌-వన్‌ ట్యాక్స్‌, రైతుల కోసం ఎం ఎస్ పి ని మరింత పెంచామని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు దేశ సమైక్యత, సమగ్రతా స్ఫూర్తిని మరింతగా పెంచిందన్నారు. అయోధ్య రామ మందిరంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుతో శతాబ్దాలుగా వివాదాస్పదమైన విషయానికి సామరస్యపూర్వకమైన పరిష్కారం దొరికిందన్నారు ప్రధాని.

ఈ కరోనా పై పోరులో ప్రజలంతా ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం అందించారని.., కరోనా పై పోరులో పని చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్ల కోసం చప్పట్లు కొట్టడం నుంచి దీపాలు వెలిగించడం వరకు, జనతా కర్ఫ్యూ నుంచి మొదలుకొని లాక్ డౌన్ నియమాలను పాటించడం వరకు ప్రజలంతా కూడా మద్దతుగా నిలిచారని ప్రధాని అన్నారు. ఒకటే లక్ష్యం కోసం పూర్తి భారతావని నిలబడిందని, శ్రేష్ట్ భారత్ కొరకు భారతావని అంతా కూడా ఏక్ భారత్‌గా  ఒక్కతాటిపై నిలబడ్డారని ప్రధాని ప్రజలను ప్రశంసించారు.