కరోనాపై మంత్రి ఎర్రబెల్లి ఆందోళన..వారిని క్వారంటైన్ చేయాలని సూచన

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా తీవ్రతపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని పకడ్బందీ చర్యలు అమలు చేస్తున్నప్పటికీ...చాపకింద నీరులా కరోనా వ్యాపిస్తోందన్నారు. పాల‌కుర్తి

కరోనాపై మంత్రి ఎర్రబెల్లి ఆందోళన..వారిని క్వారంటైన్ చేయాలని సూచన
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 07, 2020 | 4:27 PM

తెలంగాణలో కొనసాగుతున్న కరోనా తీవ్రతపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని పకడ్బందీ చర్యలు అమలు చేస్తున్నప్పటికీ…చాపకింద నీరులా కరోనా వ్యాపిస్తోందన్నారు. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని పలు మండ‌లాల ప‌రిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖ‌ల జిల్లా అధికారులతో పాటుగా స్థానిక అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, రైతు స‌మ‌న్వ‌య స‌మితి స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పాల‌కుర్తి రైతు వేదిక‌కు శంకుస్థాప‌న చేశారు. తెలంగాణ‌కు 6వ విడ‌త హ‌రిత హారంలో భాగంగా క్యాంపు కార్యాల‌యంలో, గుట్ట చుట్టూ, రైతు వేదిక స్థ‌లం వ‌ద్ద మొక్క‌లు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కరోనాపై ప్రజలను అప్రమత్తం చేస్తూ కీలక వ్యాఖ్యాలు చేశారు.

కోవిడ్ మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ తప్పక మాస్క్‌లు ధరించాలని, వీలైనంత వరకు జనసమూహాలకు దూరంగా ఉంటూ..భౌతిక దూరం పాటించాలని తెలిపారు. ఇత‌ర రాష్ట్రాలు, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల నుంచి వస్తున్న వారి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని హోం క్వారంటైన్ చేయాల‌ని అధికారులకు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే వైరస్ వ్యాప్తిని అరికట్టగలమని మంత్రి స్పష్టం చేశారు. కాబట్టి ప్రజలందరూ వైరస్ పట్ల అవగాహన కలిగి, స్వీయ నియంత్రణ పాటిస్తూ మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని కోరారు. కరోనా నియంత్రణలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.