కరోనా హాట్‌స్పాట్లుగా మారుతున్న రాష్ట్రాలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క‌రోనా అధికంగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ రష్యాను అధిగమించి మూడో స్థానంలోకి ఎగబాకింది. అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

కరోనా హాట్‌స్పాట్లుగా మారుతున్న రాష్ట్రాలు
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 07, 2020 | 4:21 PM

కరోనా కల్లోలానికి ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. ప్రశాంతంగా సాగిపోతున్న కుటుంబాల్లో ఒక్కసారిగా చిచ్చుపెట్టింది. మాయదారి రోగం బారినపడి లక్షలాది మంది ఆస్పత్రులపాలయ్యారు మరికొందరు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. చైనాలోని చిన్న మార్కెట్ నుంచి మొదలై ప్రపంచ నలుమూలాలకు వ్యాప్తి చెందింది.

ఇటు దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క‌రోనా అధికంగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ రష్యాను అధిగమించి మూడో స్థానంలోకి ఎగబాకింది. అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలు కరోనా బాధితులను ఆస్పత్రులు నిండిపోతున్నాయి. మిగతా రాష్ట్రాలు మొదట్లో తక్కువ కేసులు వెలుగు చూసినా.. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు కూడా క‌రోనా హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. ఒడిశా, పంజాబ్, జార్ఖండ్, ఛత్తీస్‌గ‌ఢ్‌, గోవాతో సహా త‌దిత‌ర రాష్ట్రాలు క‌రోనాకు కొత్త హాట్‌స్పాట్‌లుగా మారాయి. ఈ రాష్ట్రాల్లో క‌రోనా బాధితుల‌ సంఖ్య ఒక్క‌ నెలలో విపరీతంగా పెరిగింది.

క‌రోనా కట్టడికి పంజాబ్, గోవా, జార్ఖండ్ విశ్వప్రయత్నాలు చేశాయి. అయినా, అన్‌లాక్ 2.0లో ఆంక్షల సడలించడంతో వందలాది కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతాలు కూడా బఫర్ జోన్లుగా మారుతున్నాయి. మరోవైపు కర్నాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో జూన్ 19- జూలై 2 మధ్య కరోనా పాజిటివ్ కేసుల రేటు ఐదు శాతానికి పైగా పెరిగింది. ఇదే తీవ్రత కొనసాగితే దేశంలో సగానికి పైగా జనం కరోనా బారినపడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ అంక్షలతో పాటు స్వయం నియంత్రణ అవసరమంటున్నారు. ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటిస్తూ కరోనా నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచిస్తున్నారు.