ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా.. మేనకోడలికి పాజిటివ్..
ప్రస్తుతం కరోనా వైరస్ ఎటు నుంచి ఎవరిని ఎలా ఎటాక్ చేస్తుందో అసలు తెలీడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏదో ఒక రూపంలో దాని ప్రభావం చూపిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది ప్రముఖులు ఈ వైరస్...
ప్రస్తుతం కరోనా వైరస్ ఎటు నుంచి ఎవరిని ఎలా ఎటాక్ చేస్తుందో అసలు తెలీడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఏదో ఒక రూపంలో దాని ప్రభావం చూపిస్తూనే ఉంది. దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో మంది ప్రముఖులు ఈ వైరస్ బారిన పడ్డారు. కొంత మంది అయితే కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. కానీ మరికొంత మంది మాత్రం కరోనా ధాటికి తట్టుకోలేక మరణించారు.
బీహార్‌లోని కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే వైరస్ ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించింది. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ మేనకోడలకి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె పాట్నాలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మేనకోడలు కరోనా పాజిటివ్‌గా.. కుటుంబం మొత్తాన్ని ఇంటి నిర్బంధంలో ఉంచారు. దీంతో మళ్లీ ఒకసారి అందరికీ పరీక్షలు చేస్తున్నారు వైద్యులు.
Read More: సరిహద్దుల్లో చక్కర్లు కొట్టిన భారత యుద్ధ విమానాలు