AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కొత్తగా 1.15 లక్షల మందికి పెన్షన్

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైయస్ఆర్ పెన్షన్ కానుకను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ఇవాళ (బుధవారం) 59.03 లక్షల మందికి పెన్షన్ అందించేందుకు సర్వం సిద్దమైంది....

ఏపీలో కొత్తగా 1.15 లక్షల మందికి పెన్షన్
Sanjay Kasula
|

Updated on: Jul 01, 2020 | 5:43 AM

Share

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైయస్ఆర్ పెన్షన్ కానుకను అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ఇవాళ (బుధవారం) 59.03 లక్షల మందికి పెన్షన్ అందించేందుకు సర్వం సిద్దమైంది. ప్రతినెలా ఒకటో తేదీనే లబ్ధిదారుల చేతికి పెన్షన్ అందించాలన్న ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

జూలై నెల పెన్షన్ చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.1442.21 కోట్లను విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు ఈ సొమ్మును జమ చేసింది. బుధవారం ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 2.68 లక్షల మంది వాలంటీర్లు నేరుగా పెన్షనర్ల ఇళ్ళ వద్దకే వెళ్ళి పెన్షన్ డబ్బులను లబ్ధిదారుల చేతికే అందించనున్నారు.

కొవిడ్-19 నేపథ్యంలో బయోమెట్రిక్‌కు బదులుగా జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను తీసి అప్‌లోడ్ చేస్తారు. అలాగే లాక్‌డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో ఉండిపోయిన 3,364 మంది పెన్షనర్ల సొమ్మును వారు తిరిగి వచ్చిన తరువాత చెల్లించనున్నారు.

అలాగే జిల్లాల పరిధిలో పెన్షన్ బదిలీ కోసం 18,533 మంది, ఇతర జిల్లాలకు తమ పెన్షన్ బదలీ చేయాలని 7,501 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారి అప్లికేషన్లను అధికారులు పరిశీలించి, వారికి కూడా ఆ మేరకు పెన్షన్ బదిలీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు.

కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లలో 5,165 మంది హెల్త్ పెన్షనర్లు ఉన్నారు. పోర్టబులిటీ ద్వారా పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న 4,010 మంది పెన్షనర్లకు కూడా వారు కోరుకున్నప్రాంతంలోనే పింఛన్ ను అందించనున్నారు.

Follow Us
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..
భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్‌గా లేడీ కోహ్లీ..!
భారత మహిళల జట్టుకు కొత్త కెప్టెన్‌గా లేడీ కోహ్లీ..!
IND vs WI: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన కాటేరమ్మ కొడుకు..
IND vs WI: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన కాటేరమ్మ కొడుకు..
మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? హోమ్‌మేడ్ చిట్కా
మెడపై ముడతలు, సాగిన చర్మంతో ఇబ్బంది పడుతున్నారా? హోమ్‌మేడ్ చిట్కా
మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? 5 ఉత్తమ జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు!
మ్యాచ్ మధ్యలో డేటా అయిపోందా? 5 ఉత్తమ జియో డేటా బూస్టర్ ప్లాన్‌లు!
తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా
తెల్ల జుట్టుతో విసిగిపోయారా? ఇంట్లోనే హెయిర్ డై తయారు చేసుకోండిలా