కరోనాకు పతంజలి చెక్.. మరికాసేపట్లో మెడిసిన్ విడుదల..!
ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారికి పతంజలి చెక్ పెట్టనుంది. ఈ విషయాన్ని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. కరోనా మహమ్మారికి ఆయుర్వేదం ద్వారా...

ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తున్న కరోనా మహమ్మారికి పతంజలి చెక్ పెట్టనుంది. ఈ విషయాన్ని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. కరోనా మహమ్మారికి ఆయుర్వేదం ద్వారా నయం చేయవచ్చని తాము విశ్వసిస్తున్నామని.. దీనికి సంబంధించిన మెడిసిన్ కూడా రెడీ చేసి.. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు ఇటీవలే ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని గత వారం రోజుల క్రితమే తెలిపారు. తాజాగా సోమవారం రాత్రి.. ఆయన ట్విట్టర్‌లో మరోసారి దీని గురించి ప్రస్తావించారు. తాము కనుగొన్న మెడిసిన్ గురించి మంగళవారం మధ్యాహ్నం 12.00 గంటలకు పూర్తి వివరాలను తెలియజేస్తామని పోస్ట్ చేశారు. హరిద్వార్‌లోని పతంజలి యోగా పీఠ్ వేదికగా ఈ మెడిసిన్ శాస్త్రీయత గురించి తెలుపనున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ మెడిసిన్‌తో కరోనా సోకిన రోగి.. 4-15 రోజుల్లో కోలుకుంటున్నట్లు ఇప్పటికే తెలిపారు. ఈ మెడిసిన్‌కు స్వసరీ వాటి, కరోనిల్ అని నామకరణం కూడా చేశారు. మొత్తానికి ఒకవేళ ఈ మెడిసిన్ కరోనాకు చెక్ పెట్టేది అయితే.. ఆయుర్వేదంలో కనుగొన్న తొలి మెడిసిన్ ఇదే కానుంది.
#कोरोना की एविडेंस बेस्ड प्रथम #आयुर्वेदिक औषधि, #श्वासारि_वटी ,#कोरोनिल का संपूर्ण साइंटिफिक डॉक्यूमेंट के साथ कल दोपहर 12 बजे #पतंजलि योगपीठ हरिद्वार से लॉन्च कर रहे है?? pic.twitter.com/SQ5cXOzHVB
— Acharya Balkrishna (@Ach_Balkrishna) June 22, 2020



