Huzurabad constituency: హుజూరాబాద్ నియోజకవర్గంపై కరోనా పంజా.. కమలాపూర్ మండలంలోనే 256 మందికి కరోనా పాజిటివ్
ఎన్నికల షెడ్యూలు రానేలేదు. వందశాతం వ్యాక్సిన్ ప్రక్రియ కానేలేదు. కరోనా రక్కసి కన్నేసింది. రాజకీయ పక్షాలు ర్యాలీలు.. సభలతో సందడి మొదలు పెట్టడంతో జనం గుమిగూడేలా ప్రోత్సహిస్తూ
ఎన్నికల షెడ్యూలు రానేలేదు. వందశాతం వ్యాక్సిన్ ప్రక్రియ కానేలేదు. కరోనా రక్కసి కన్నేసింది. రాజకీయ పక్షాలు ర్యాలీలు.. సభలతో సందడి మొదలు పెట్టడంతో జనం గుమిగూడేలా ప్రోత్సహిస్తూ కరోనాను పెంచి పోషిస్తున్నారు. థర్డ్ వేవ్ ముప్పు ఉందని తెలిసినా ప్రజలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. తెలంగాణలో తగ్గుతోంది అని అనుకునేంతలో మరో బ్యాడ్ నెంబర్ కనిపించింది. రాష్ట్రం మొత్తం కరోనా నెంబర్ తగ్గుతుంటే హుజూరాబాద్ నియోజక వర్గంలో మాత్రం ఒక్కసారిగా కరోనా బాధితుల సంఖ్య పెరిగింది.
అది ఎక్కడో కాదు హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌లో కోవిడ్ రక్కసి విస్తరిస్తోంది. ఈ మండలంలో ప్రస్తుతం ఏకంగా 254 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అనేక గ్రామాల్లో రోజురోజుకూ ఈ సంఖ్య భారీగా పెరుగుతున్నా.. కట్టడి చేయడంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ రానప్పటికీ.. ఈ నియోజకవర్గంలో మాత్రం రాజకీయ సందడి మొదలైంది. రాజకీయ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. వీరు చేస్తున్న ర్యాలీలు, సభలతో జనం ఒక్కచోటికి చేరుతున్నారు దీంతో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. ఇటీవల వరంగల్ బల్దియాతోపాటు రాష్ట్రంలోని పలు పురపాలిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇక్కడ అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. ఎన్నికల విధుల్లో పాల్గొన్న అనేక మంది ఉద్యోగులు కొవిడ్ బారిన పడి ప్రాణాలు వదలడం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
రెండో దశ వ్యాప్తి ఇంకా పూర్తిగా తగ్గకముందే త్వరలో రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమదే పైచేయి కావాలని ఆయా పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. వేలాది మందితో సభలు, సమావేశాలు, బైక్ ర్యాలీలు చేపడుతున్నాయి. ఫలితంగా లక్ష్మీపురంలో 430 జనాభా ఉంటే 42 కేసులు నమోదు కావడంతో ఆందోళన మొదలైంది. మండల కేంద్రంతోపాటు, శనిగరం, గోపాలపురం, మాదన్నపేట, అంబాల, గూడూరు, మరిపల్లిగూడెం.. ఇలా అన్ని చోట్లా కరోనా విజృంభిస్తుండడంతో వైద్య బృందాలు రంగంలోకి దిగాయి.
కమలాపూర్ మండలం వరంగల్‌కు సమీపంలో ఉండటంతో అక్కడి ప్రజలు తరచూ నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో హనుమకొండలోనూ కేసులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Brahmamgari Matam: మఠాధిపతి ఎవరు? చిక్కుముడి వీడేనా? రిజర్వ్‌లో కోర్టు తీర్పు..