AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పతంజలి మందుతో కరోనా రోగులపై ట్రయల్స్.. జైపూర్ ఆసుపత్రికి నోటీస్

పతంజలి ఆయుర్వేద మందు'కొరొనిల్' ని కరోనా వైరస్ రోగులపై ట్రయల్స్ నిర్వహించినందుకు సంజాయిషీ ఇవ్వాలంటూ.. రాజస్తాన్ ఆరోగ్య శాఖ.. జైపూర్ లోని నిమ్స్ ఆసుపత్రికి నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆసుపత్రి తన చర్యకు..

పతంజలి మందుతో కరోనా రోగులపై ట్రయల్స్.. జైపూర్ ఆసుపత్రికి నోటీస్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 27, 2020 | 11:45 AM

Share

పతంజలి ఆయుర్వేద మందు’కొరొనిల్’తో  కరోనా వైరస్ రోగులపై ట్రయల్స్ నిర్వహించినందుకు సంజాయిషీ ఇవ్వాలంటూ.. రాజస్తాన్ ఆరోగ్య శాఖ.. జైపూర్ లోని నిమ్స్ ఆసుపత్రికి నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆసుపత్రి తన చర్యకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతిని కోరలేదని, ఇలా చేస్తున్నట్టు సమాచారాన్ని కూడా ఇవ్వలేదని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరోత్తమ్ శర్మ తెలిపారు. గత మంగళవారం యోగా గురు బాబా రాందేవ్ లాంచ్ చేసిన కొరొనిల్ ఔషధం అప్పుడే వరుసగా వివాదాలను ఎదుర్కొంటోంది. దీని ట్రయల్ పై సమాచారాన్ని ఇవ్వాలని పతంజలి సంస్థను కోరిన ఆయుష్ మంత్రిత్వ శాఖ.. ఇది కరోనా రోగుల చికిత్సలో బాగా పని చేస్తుందన్న ప్రచారంపై నిషేధం విధించింది. ఆయుష్ శాఖ అనుమతి లేనిదే ఈ మందును తమ రాష్ట్రంలో రోగులకు వాడరాదని రాజస్థాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా ఈ మందును అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి రఘుశర్మ హెచ్చరించారు. అటు-ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా పతంజలి సంస్థకు నోటీసు జారీ చేయనుంది. దగ్గు, జ్వరాన్ని నివారించి రోగనిరోధక శక్తిని పెంచే మందుకు  లైసెన్సు కావాలని  మాత్రమే ఈ సంస్థ దరఖాస్తు పెట్టుకుందని ఆ ప్రభుత్వం పేర్కొంది. కాగా బీహార్ లో కూడా ఓ వ్యక్తి ఈ మందుపై కోర్టులో పిటిషన్ వేశారు. బాబా రాందేవ్, ఆచార్య బాలకృష్ణ లక్షలాది కరోనా రోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని, పతంజలి సంస్థపై చర్య తీసుకోవాలని ఆయన కోరారు. దీనిపై ఈ నెల 30 న  కోర్టులో విచారణ జరగనుంది.

Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!
కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!